Site icon NTV Telugu

Shocking: నాలుగేళ్ల కూతురుని కత్తితో పొడిచిన తల్లి.. ఎందుకిలా చేసింది..?

Mother

Mother

Shocking: దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు, కిడ్నాప్ లు, మర్డర్లు, మానభంగాలు అంటూ ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ పూణెలో నవమాసాలు మోసి కని నాలుగేళ్ల పాటు పెంచిన కూతురిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. ఈ షాకింగ్ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. సాధారణంగా ఏ తల్లైనా తన బిడ్డలకు చిన్న గాయమైనా తట్టుకోలేరు. ఎంత కష్టపడైనా తన బిడ్డలను ఆపదల నుంచి సురక్షితంగా బయటపడేసేందుకు ప్రయత్నిస్తుంది. పిల్లలను కాపాడుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టే తల్లుల గురించి విన్నాం కానీ… అయితే పూణెలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటన హదప్సర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Read Also: Strange Incident : ఒకే కాన్పులో నలుగురు.. ఎక్కడో కాదు మన దగ్గరే

కల్పన అనే మహిళ తన కుమార్తెతో ఒంటరిగా జీవిస్తోంది. ఈ సంఘటన సోమవారం (మార్చి 27) రాత్రి 9:30 గంటలకు హడప్‌సర్‌లోని సిద్ధివినాయక్ దుర్వాంకూర్ సొసైటీ ససానే నగర్‌లో జరిగింది. అయితే బాలిక ఎందుకు హత్యకు గురైందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో ఆమె తల్లి కల్పనను హడప్సర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 రోజుల క్రితం, సంబంధిత కుటుంబం అక్కడ ఉండటానికి వచ్చింది. కల్పన బేకరీ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారం చేస్తోంది. కల్పన సోమవారం అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంది. దీంతో ఇంటి యజమాని అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె లోపలి నుంచి తలుపు వేసుకుంది. ఇరుగుపొరుగు వారు ఆమెను తలుపు తెరవాలని కోరారు. ఇంటి యజమాని, ఇరుగుపొరుగు వారు లోపలికి వెళ్లి బాలిక మృతదేహాన్ని చూశారు. దీంతో వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. దీనిపై హడప్‌సర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. హత్య వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Read Also:Minister KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేటీఆర్ షాక్.. 100 కోట్ల మేర పరువునష్టం దావా నోటీసులు

Exit mobile version