Crime News: వివాహేతర సంబంధాలు వ్యక్తుల ప్రాణాలు తీసే దాకా వెళ్తున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాల వల్లే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ వివాహితల హత్యలు, భర్తల హత్యలు జరిగినా దాదాపు వివాహేతర సంబంధాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇటీవల కూతుర్లు, కొడుకులు కూడా హత్యకు గురవుతున్నారు. కనిపెంచిన కూతురును కిరాతకంగా కొట్టి చంపింది ఓ కసాయి తల్లి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన బంగాల్‌లో చోటుచేసుకుంది. బంగాల్‌లోని కూచ్‌బెహర్ ప్రాంతానికి చెందిన అర్పితా మల్లిక్(23) అనే యువతి దారుణంగా హత్యకు గురైంది. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. తన ప్రియుడి సాయంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. అలీపుర్దువార్ ప్రాంతంలో దుర్గా మల్లిక్, బలరామ్ మల్లిక్ తమ కూతురైన అర్పితా మల్లిక్‌లతో కలిసి నివసిస్తున్నారు. కొంతకాలం క్రితం వారింట్లోకి షంషేర్ ఆలం అనే వ్యక్తికి అద్దెకు ఇవ్వగా.. అర్మితా కుటుంబానికి షంషేర్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. షంషేర్ అప్పుడప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయపడేవాడు. అప్పులు ఇచ్చేవాడు. ఈ క్రమంలో అర్పితా మల్లిక్ తల్లి దుర్గా మల్లిక్‌కు.. షంషేర్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న అర్పిత తన తల్లిని ప్రశ్నించింది. ఈ క్రమంలో దుర్గా మల్లిక్, షంషేర్ కలిసి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అర్పితను హత్య చేసేందుకు పథకాన్ని రచించారు.
Read Also: Video Call: ప్రేయసితో వీడియో కాల్.. ఆమె చూస్తుండగానే మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు
బుధవారం బలిరామ్ మల్లిక్ ఇంటి నుంచి బయటకు వెళ్లకు.. దుర్గా, షంషేర్‌తో కలిసి అర్పితను ఓ చెక్కతో అతి కిరాతకంగా కొట్టింది. దీంతో అర్పిత గట్టిగా అరించింది. అనంతరం దుర్గా మల్లిక్, ఆమె ప్రియుడు షంసేర్ అక్కడ నుంచి పరారయ్యారు. ఈ అరుపులు విన్న బలరామ్ తమ్ముడు బిమాల్ మల్లిక్ తన అన్నయ్య ఇంటికి వెళ్లాడు. బిమాల్‌తో పాటు ఇరుగుపొరుగు వారు కూడా అక్కడకి చేరుకున్నారు. రక్తం మడుగులో పడి ఉన్న అర్పితను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్పితా ప్రాణాలు విడిచింది. పరారీలో ఉన్న నిందితులు దుర్గా మల్లిక్, షంషేర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
