Site icon NTV Telugu

Crime News: పెందుర్తిలో పెను విషాదం.. కొడుకు, కూతురుతో బావిలో దూకిన తల్లి!

Dead Body Parcel West Godavari

Dead Body Parcel West Godavari

ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో పెను విషాదం చోటుచేసుకుంది. సత్యవాణిపాలెం గ్రామంలో కుటుంబ కలహాలతో కొడుకు, కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందారు. కూతురు ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపులే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి..

Also Read: Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

సత్యవాణిపాలెం గ్రామానికి చెందిన కొల్లు పవన్, గీత (26) భార్యాభర్తలు. వీరికి కుమారుడు భవిష్యన్ మణికంఠ (7), కుమార్తె మోక్షశ్రీ (9)లు ఉన్నారు. పవన్‌ మద్యానికి బానిస అవవడంతో.. గీతతో తరచుగా గొడవలు అయ్యేవి. ఈ క్రమంలో గీత తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి అనంతరం ఆమె కూడా దూకింది. ఈ ఘటనలో గీత, మణికంఠ మృతి చెందారు. మోక్షశ్రీ బావిలో మెట్టును పట్టుకొని ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. గ్రామస్తులు మోక్షశ్రీ కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణం అని స్థానికులు అంటున్నారు.

 

Exit mobile version