Site icon NTV Telugu

Viral Video: మొసలి బారి నుంచి బిడ్డను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన తల్లి.. వీడియో వైరల్!

Mother Deer

Mother Deer

బిడ్డకు ఆపద వస్తే అర సెకన్ కూడా ఆలోచించకుండా అడ్డుపడిపోయే వ్యక్తి అమ్మ. బిడ్డను కాపాడుకోవడం కోసం ఎంతటి వారినైనా అమ్మ ఎదురిస్తుంది. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా వెనుకాడదు. మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. బిడ్డను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసేలా ఉంది.

Also Read: Dorset Beach: వీళ్లు చాలా లక్కీ భయ్యా… నిమిషంలో తప్పించుకున్నారు!

ఈ వీడియోను horrors అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసేలా ఉంది. చూస్తే కన్నీళ్లు ఖాయం అనిపించే ఈ వీడియోలో ఓ తల్లి తన పిల్లను కాపాడుకోవడం కోసం ఏకంగా తన ప్రాణాలనే కోల్పొయింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్ల జింక నీటిలో వెళ్తూ ఉండగా ఒక మొసలి వేగంగా దాని వైపుకు వస్తూ ఉంటుంది. దీనిని గమనించిన తల్లి జింక పరుగు పరుగున వచ్చి ఆ ముసలికి అడ్డుగా నిలుస్తుంది. దీంతో పిల్ల జింకను తిందాం అనుకున్న మొసలి తల్లి జింకను చంపేస్తుంది. ఈ వీడియో చూస్తే గుండెల్లో కలుక్కుమన్నట్లు కళ్ల నుంచి నీరు వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు లక్షకు పైగా లైక్ లు వచ్చాయి. తల్లి ప్రేమ ఎంతో గొప్పదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version