Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Mother Dairy Hikes Milk Prices For 5th Time This Year

Mother Dairy Hikes Milk Price : పాల ధరను భారీగా పెంచిన మదర్ డైరీ.. ఏడాదిలో ఇది ఐదోసారి

Published Date :December 26, 2022 , 4:59 pm
By Rakesh Reddy
Mother Dairy Hikes Milk Price : పాల ధరను భారీగా పెంచిన మదర్ డైరీ.. ఏడాదిలో ఇది ఐదోసారి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mother Dairy Hikes Milk Price : పెట్టుబడి ఖర్చులు పెరగడంతో మంగళవారం నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్ మార్కెట్‌లో పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచాలని మదర్ డెయిరీ నిర్ణయించింది. రోజుకు 30 లక్షల లీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ప్రముఖ పాల సరఫరాదారులలో ఒకటైన మదర్ డెయిరీ ఈ ఏడాది పాల ధరలను పెంచడం ఇది ఐదోసారి. మదర్ డెయిరీ ఫుల్‌క్రీమ్ పాల ధరను లీటరుకు రూ.2 పెంచడంతో అది రూ.66కి చేరింది. టోన్డ్ మిల్క్ రేటు లీటరుకు రూ.51 నుంచి రూ. 53కి పెంచారు. డబుల్ టోన్డ్ మిల్క్ రేటు లీటరుకు రూ.45 నుండి రూ.47 కి చేరింది. ఆవు పాలు, టోకెన్ (బల్క్ వెండెడ్) పాల వేరియంట్‌ల ధరలను పెంచకూడదని మదర్ డెయిరీ నిర్ణయించింది.

Read Also: Omicron BF7 : మాస్క్ పెట్టాల్సిందే.. శానిటైజర్ పూసుకోవాల్సిందే.. ప్రజలకు సీఎం వార్నింగ్

పాల ధరల పెంపుతో సామాన్యుల గృహ బడ్జెట్‌పై ప్రభావం పడనుంది. పాడి రైతుల నుంచి కంపెనీకి ముడి పాల సేకరణ వ్యయం పెరగడమే ధరల పెంపునకు కారణమని మదర్ డెయిరీ పేర్కొంది. ముడి పాల సేకరణ ధరలు గత ఏడాది కంటే దాదాపు 24 శాతం పెరిగాయని కంపెనీ పేర్కొంది. పెరిగిన ధఱలు డిసెంబర్ 27 నుండి అమలులోకి రానున్నట్లు మదర్ డైరీ తెలిపింది. ఈ ఏడాదిలో కంపెనీ అనేక సార్లు పాల ధరలను పెంచింది. చివరిసారిగా నవంబర్ 21న ఫుల్‌క్రీమ్ పాల ధరలను లీటరుకు రూ.1, టోకెన్ పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. అమూల్ బ్రాండ్‌తో పాలను విక్రయిస్తున్న గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) ఢిల్లీ-NCR మార్కెట్‌లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. రోజుకు దాదాపు 40 లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు అయిన భారతదేశంలో పాల ఉత్పత్తి సంవత్సరానికి 210-220 మిలియన్ టన్నులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • GCMMF
  • milk price hike
  • milk prices
  • Mother Dairy
  • Mother Dairy Hikes Milk Prices

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions