Site icon NTV Telugu

Shocking: అందరూ చూస్తుండగానే రైలు కింద పడిన తల్లి కొడుకులు..

Mother Son

Mother Son

Shocking: భూమిపై నూకలుండడం అంటే ఇదేనేమో.. తల్లి కుమారుడు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కర్ణాటకలోని కాలబుర్గిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఒక మహిళ తన కుమారుడితో కలిసి కాలబుర్గి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. రైలు పట్టాలు దాటుతూ ఒక ఫ్లామ్‌ఫామ్‌ నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌ వద్దకు వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. రైలు పట్టాలు దాటుతుండగా రైలు వస్తుండాన్ని గమనించారు. ఫ్లాట్‌ఫామ్‌ కింద గొడ అంచున ఉండిపోయారు. భయపడిన కుమారుడు తల్లిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ గూడ్స్‌ రైలు వెళ్లిన తర్వాత వారిద్దరూ పైకి లేచి ఫ్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. అదృష్టవశాత్తు ఆ మహిళ, ఆమె కుమారుడికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. మరోవైపు ఎదురుగా ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఇది చూసి చాలా ఆందోళన చెందారు. అయితే తల్లి, కుమారుడు క్షేమంగా బయటపడటంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. కొందరు ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Exit mobile version