NTV Telugu Site icon

Travel Tips: ప్రపంచంలోనే అద్భుతమైన రోడ్లు.. ఒక్కసారి ప్రయాణిస్తే చాలు..

Roads

Roads

ప్రపంచంలోనే అందమైన రోడ్లను మీరు ఎప్పుడూ చూసుండరు కదా.. ఈ రోడ్లను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ మీరు ప్రయాణించాలంటే అదోపెద్ద సాహసం చేసినట్లే అవుతుంది. అలాంటి రోడ్లపై మీరు ప్రయాణం చేయాలని కోరుకున్నట్టయితే మీరు ప్రపంచంలోని ఆ ఐకానిక్ రోడ్ల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే..

Also Read : Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..

ఆస్ట్రేలియాలోని గ్రేట్ ఓషన్ రోడ్ అందంగా ఉంటుంది. 243 కిలోమీటర్ల పొడవైన మార్గం ఆగ్నేయ తీరానికి లింక్ అయ్యి అలన్‌ఫోర్డ్‌కు కలుపుతుంది. ఈ రూట్ లో ప్రయాణిస్తే 12 అపోస్టల్స్‌ కనిపిస్తాయి.. ఇది మరింత అందంగా ఉంటుంది. అపోస్టల్స్ అని పిలువబడే రాతి స్తంభాల వంటి ఆకారం. గ్రేట్ ఓషన్ రోడ్ విభిన్న ప్రకృతి దృశ్యాలు, ఆకర్షణలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

Also Read : Putin: ప్రపంచం “టర్నింగ్ పాయింట్” వద్ద ఉంది.. యుద్ధానికి వెస్ట్రన్ దేశాల అహంకారమే కారణం

పాన్-అమెరికన్ హైవే ఈ రహదారిపై జర్నీ చంద్రునిపై ప్రయాణించినట్లు అనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే పొడవైన డ్రైవింగ్ రూట్. దీని పొడవు దాదాపు 30 వేల కిలోమీటర్లు ఉంటుంది. జర్మనీ యొక్క ది బ్లాక్ ఫారెస్ట్ రహదారి అద్భుతంగా ఉంటుంది. ఈ దారిలో నడుస్తుంటే ఎన్నో చారిత్రక వారసత్వ సంపదను మనం చూడవచ్చు. నార్వే ది అట్లాంటిక్.. చిన్న ద్వీపాలపై రహదారి నిర్మించబడింది. 8.3 కిలోమీటర్ల పొడవైన ఈ రూట్ లో నడవడం వెరీ స్పెషల్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది.

Also Read : IPL 2023 : ఐపీఎల్ లో కీలక పోరుకు రంగం సిద్ధం.. ఆర్సీబీ వర్సెస్ ముంబై ఢీ

భారతదేశంలోని లేహ్ మనాలి హైవే కూడా ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన మార్గాలలోకి వస్తుంది. ఈ ప్లేస్ సాహసలు చేసే బైక్ రైడర్స్ బాగుంటుంది. ఇక్కడ నుంచి పర్వతాలు చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తాయి. న్యూజిలాండ్‌లోని మిల్‌ఫోర్డ్ రోడ్ కూడా ప్రపంచంలోని అత్యుత్తమ రోడ్లలో ఒకటిగా పేరుగాంచింది. పర్వతాల గుండా వెళ్లడం నిజంగా ఆనందకరంగా ఉంటుంది.