NTV Telugu Site icon

Kohli-Sachin: అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ!

Kohli Sachin

Kohli Sachin

Sachin Tendulkar vs Virat Kohli, Most International Hundreds after 499 Matches: అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ 100 సెంచరీలు బాదాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 శతకాలు చేసిన సచిన్.. తన పేరుపై 100 సెంచరీల రికార్డు లికించుకున్నాడు. ఈ రికార్డు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 75 శతకాలు చేశాడు. టెస్టుల్లో 28, వన్డేల్లో 46, టీ20ల్లో 1 సెంచరీ బాదాడు. సచిన్ తర్వాతి స్థానంలో కోహ్లీ ఉన్నాడు. మరి సచిన్ రికార్డుని విరాట్ సమం చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా?.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 499 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 75 సెంచరీలు చేశాడు. ఇప్పుడు అన్నే మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ కూడా 75 శతకాలు బాదాడు. దాంతో సచిన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. సచిన్ మొత్తంగా 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి.. 100 సెంచరీలు చేశాడు. సచిన్ రికార్డును అందుకొవాలంటే విరాట్ ఇంకా 165 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే 34 ఏళ్లు ఉన్న కోహ్లీ.. సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.

Also Read: Hero Xtreme 200S 4V Launch: హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200ఎస్ 4వీ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

అంతర్జాతీయ క్రికెట్​లో సెంచరీ (100 పరుగులు) చేయడం అంత ఈజీ కాదు. అయితే సచిన్ టెండూల్కర్ మాత్రం ఏకంగా ‘సెంచరీ’ శతకాలు బాదాడు. టెస్ట్​, వన్డే, టీ20 ఫార్మాట్లను కలుపుకొని అత్యధిక శతకాలు చేసిన జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ​664 మ్యాచ్​లలో 100 సెంచరీలు పూర్తి చేశాడు. విరాట్​ కోహ్లీ 499 మ్యాచ్​ల్లో 75 సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ రికీ పాయింటింగ్​ 560 మ్యాచ్​లు ఆడి 71 సెంచరీలు చేశాడు. శ్రీలంక మాజీ సారథి​ కుమార సంగక్కర 594 మ్యాచ్​లలో 63 సెంచరీలు బాదాడు.​ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్​ కలిస్ 519 మ్యాచ్​లలో 62 సెంచరీలు బాది టాప్ 5లో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక సెంచరీల జాబితా (Most Hundreds in International Cricket):
సచిన్ టెండూల్కర్ – 100
విరాట్​ కోహ్లీ – 75
రికీ పాయింటింగ్ – 71
కుమార సంగక్కర – 63
జాక్వెస్​ కలిస్ – 62

Also Read: Sri Ramana Died: ‘మిథునం’ సినిమా రచయిత శ్రీరమణ కన్నుమూత!

Show comments