Kohli-Sachin: అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు.. సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar vs Virat Kohli, Most International Hundreds after 499 Matches: అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ 100 సెంచరీలు బాదాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 శతకాలు చేసిన సచిన్.. తన పేరుపై 100 సెంచరీల రికార్డు లికించుకున్నాడు. ఈ రికార్డు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 75 శతకాలు చేశాడు. టెస్టుల్లో 28, వన్డేల్లో 46, టీ20ల్లో 1 సెంచరీ బాదాడు. సచిన్ తర్వాతి స్థానంలో కోహ్లీ ఉన్నాడు. మరి సచిన్ రికార్డుని విరాట్ సమం చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా?.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 499 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 75 సెంచరీలు చేశాడు. ఇప్పుడు అన్నే మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ కూడా 75 శతకాలు బాదాడు. దాంతో సచిన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. సచిన్ మొత్తంగా 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి.. 100 సెంచరీలు చేశాడు. సచిన్ రికార్డును అందుకొవాలంటే విరాట్ ఇంకా 165 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే 34 ఏళ్లు ఉన్న కోహ్లీ.. సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
Also Read: Hero Xtreme 200S 4V Launch: హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ 4వీ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!
అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ (100 పరుగులు) చేయడం అంత ఈజీ కాదు. అయితే సచిన్ టెండూల్కర్ మాత్రం ఏకంగా ‘సెంచరీ’ శతకాలు బాదాడు. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లను కలుపుకొని అత్యధిక శతకాలు చేసిన జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 664 మ్యాచ్‌లలో 100 సెంచరీలు పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ 499 మ్యాచ్‌ల్లో 75 సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాయింటింగ్ 560 మ్యాచ్‌లు ఆడి 71 సెంచరీలు చేశాడు. శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర 594 మ్యాచ్‌లలో 63 సెంచరీలు బాదాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్ కలిస్ 519 మ్యాచ్‌లలో 62 సెంచరీలు బాది టాప్ 5లో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీల జాబితా (Most Hundreds in International Cricket):
సచిన్ టెండూల్కర్ – 100
విరాట్ కోహ్లీ – 75
రికీ పాయింటింగ్ – 71
కుమార సంగక్కర – 63
జాక్వెస్ కలిస్ – 62
Also Read: Sri Ramana Died: ‘మిథునం’ సినిమా రచయిత శ్రీరమణ కన్నుమూత!
Most International hundreds after 499 matches:
1) Virat Kohli – 75
2) Sachin Tendulkar – 75 pic.twitter.com/OFEkR1BITQ
— Johns. (@CricCrazyJohns) July 19, 2023
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!