Site icon NTV Telugu

Montra Rhino 5538 EV: మార్కెట్ లోకి మోంట్రా రైనో 5538 ఎలక్ట్రిక్ ట్రక్.. సింగిల్ ఛార్జ్ తో 198KM రేంజ్..

Montra Rhino 5538 Ev

Montra Rhino 5538 Ev

భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగోతోంది. ఆటోమొబైల్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఈవీలను మార్కెట్ లోకి తీసుకొస్తు్న్నాయి. తాజాగా మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ ట్రక్, మోంట్రా రైనోను సెప్టెంబర్ 28న భారత మార్కెట్ లో విడుదల చేసింది. మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ ట్రక్కు, మోంట్రా రైనో 5538 EV 4×2 TT ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ట్రక్కును ఫిక్స్‌డ్ బ్యాటరీతో రూ. 1.15 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరకు, రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్‌తో రూ. 1.18 కోట్ల ధరకు విడుదల చేశారు.

Also Read:CM Chandrababu Meets Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో సీఎం చంద్రబాబు గంటకుపైగా భేటీ.. ఈ అంశాలపైనే చర్చ..

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ట్రక్కును ఫిక్స్డ్ అండ్ రిమూవబుల్ బ్యాటరీలతో విడుదల చేశారు. ఇది 282 kWh LFP బ్యాటరీని కలిగి ఉంది. ఇది 198 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది. ఫిక్స్డ్ బ్యాటరీ వెర్షన్ వేగవంతమైన ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది. రిమూవబుల్ బ్యాటరీని మార్చడానికి కేవలం ఆరు నిమిషాలు పడుతుంది. దీని మోటారు 380 హార్స్‌పవర్, 2,000 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌ను కూడా కలిగి ఉంది.

Exit mobile version