Montha Cyclone: తెలంగాణకు అతి సమీపంలో మొంథా తుఫాన్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ వైపు తుఫాన్ కదులుతుందని వెల్లడించింది.. మధ్యాహ్నంలోపు ఉమ్మడి ఖమ్మం జిల్లాను తాకనుంది మొంథా.. రాబోయే 6-12 గంటల్లో వాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా మారనుంది. వాయుగుండంగా మారుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది.. సాధారణంగా ఈ తుఫాన్ ఛత్తీస్గఢ్ వైపు కదలాల్సి ఉంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు.. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ వైపు కదులుతోంది. మరో 12-24 గంటల్లో తుఫాన్ ఎఫెక్ట్ పూర్తిగా తగ్గనుంది.
READ MORE: Chennai: చెన్నైలో దారుణం.. మహిళపై అత్యాచారం చేసి బైక్ టాక్సీ డ్రైవర్ పరార్
ఇప్పటికే.. మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హన్మకొండ, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్ష సూచన జారీ చేశారు. ఈ జిల్లాల్లో మధ్యాహ్నం వరకు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే అవకాశం ఉండటంతో మున్సిపల్ సిబ్బంది, విపత్తు నిర్వాహక బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
