NTV Telugu Site icon

NBK 109 : మాన్‌స్టర్‌ వచ్చేస్తున్నాడు.. స్టన్నింగ్ లుక్ వైరల్..

Nbk109 (1)

Nbk109 (1)

NBK 109 :నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” NBK 109 “..ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.దర్శకుడు బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Read Also :BB4 : బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి రిపీట్..

ఈ సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్సె వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇందులో బాలయ్య స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ చెప్పే మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చేసాయి.ఇదిలా ఉంటే నేడు (జూన్ 10 )బాలయ్య బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్తున్నింగ్ అప్డేట్ ఇవ్వనున్నారు.తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ లుక్ ను రిలీజ్ చేసారు.మాన్‌స్టర్‌ గురించి ఈ రోజు ఉదయం 11.27 గంటలకు రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.బాలకృష్ణ గూడ్స్ రైలు నుంచి రెండు బ్యాగ్ లు పట్టుకొని పొగ మంచులో నడుచుకుంటూ వస్తున్న లుక్ ను రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Show comments