Site icon NTV Telugu

Money rain on Highway: హైవేపై డబ్బుల వర్షం, ఎగబడిన జనం.. వీడియో వైరల్

Money Rain

Money Rain

Money rain on Highway: సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే.. మరో ఆలోచన లేకుండా తీసుకుని మెల్లగా అక్కడ నుంచి వెళ్లిపోతుంటారు. అలాంటిది డబ్బుల వర్షం కురిస్తే ఎవరైనా ఊరుకుంటారా?. అలాంటి ఘటనే చిలీ దేశంలో జరిగింది. హైవేపై డబ్బుల వర్షం కురవడంతో జనం ఎగబడ్డారు. ఎక్కువ మొత్తాన్ని జమ చేసుకునేందుకు పరుగులు తీశారు. రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ అయినా పట్టించుకోలేదు. చిలీలోని ఓ హైవేపై డబ్బుల వర్షం కురిపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటన నిజానికి గ్యాంబ్లింగ్‌ హాలులో జరిగిన దోపిడీతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది.

Srilanka: శ్రీలంకలో ఇల్లు అమ్మి తమిళనాడుకు చేరుకున్న మహిళ.. ఎందుకో తెలుసా?

పుడహూల్‌లోని ఒక క్యాసినోలో రాత్రి 7:45 గంటల ప్రాంతంలో దొంగలు దాడికి పాల్పడి భారీగా నగదు దోచుకున్నారని పోలీసులు వెల్లడించారు. గ్యాంబ్లింగ్‌ హాల్‌లోని సిబ్బందిని, అక్కడున్న వారిని ఆయుధాలతో బెదిరించి పరారైనట్లు కోఆపరేటివా మీడియా పేర్కొంది. దుండగులు తమ కారులో పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని వెంబడించడం ప్రారంభించారు. దీంతో వారు ఉత్తర తీర ప్రాంతానికి వెళ్లే హైవేపైకి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకోవడానికి దొంగలు కరెన్సీ నోట్లను హైవేపై వెదజల్లుతూ వెళ్లారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. కారును అడ్డగించి వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన ఆరుగురిలో మొత్తం మంది విదేశీయులేనని పోలీసులు తెలిపారు. అందులో ఇద్దరు దేశంలో ‍అక్రమంగా నివాసం ఉంటున్నారని చెప్పారు. అయితే, వారు ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని బయటకు తెలపలేదు. మరోవైపు.. గ్యాంబ్లింగ్‌ హాల్‌లో, హైవేపై ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ డబ్బుల వర్షం దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Exit mobile version