Site icon NTV Telugu

Election Commission: 22లక్షల ఓట్లను తొలగించాం.. వాళ్లు ఇంటి నుంచే ఓటు వేసే ఛాన్స్

Ec

Ec

ఓటుకు నోటు అనేది ఒకటి ఇవ్వడం.. మరొకటి తీసుకోవడం అని ఎలక్షన్ కమిషనర్ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటుకు నగదు పంపిణీ ఎక్కువ సంఖ్యలో అనేది మా దృష్టికి వచ్చింది.. రాబోయే ఎన్నికల్లో పటిష్టమైన నిఘా పెడుతున్నామని ఆయన చెప్పారు. చెక్ పోస్ట్ ల దగ్గర పటిష్టమైన నిఘా.. మొదటిసారి ఫారెస్ట్ చెక్ పోస్ట్ లు పెట్టాము.. ప్రతీ చెక్ వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసాము అని ఈసీ తెలిపింది. ఫాల్స్ ఆఫీడవిట్ పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.. ప్రతీ ఆఫిడవిట్ పూర్తిగా ఆన్లైన్ లో పెడుతాం.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించాలని రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Read Also: Bombay High Court: రూ. 100 లంచం తీసుకున్న అధికారి.. కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..?

యంగెస్ట్ స్టేట్ తెలంగాణ.. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రధాన్యత ఉంది అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం.. రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి.. అక్రమ నగదు-మద్యంను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు.. అర్బన్ ఏరియాల్లో మైక్రో అబ్జార్వార్లను పెట్టాలని కోరారు అని ఎన్నికల కమిషనర్ చెప్పుకొచ్చారు. 119 సెగ్మెంట్లలో 88 జనరల్, ఎస్టీ 12, ఎస్సీ 19 ఉన్నాయి.. 80 ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43లక్షలు, 100 ఏళ్లకు పైబడిన వాళ్ళు 7,689 మంది ఉన్నారు అని రాజీవ్ కుమార్ చెప్పారు.

Read Also: Putin: ప్రధాని మోడీ చాలా తెలివైన వ్యక్తి.. రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..

అయితే, తెలంగాణలో 22 లక్షల ఓట్లను డిలీట్ చేశాము అని ఎలక్షన్ కమిషనర్ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ ఇష్యూ ఉంది.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో దాదాపు వెయ్యి సమావేశాలు నిర్వహించాం.. ఎన్నికల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది.. ఈ సారి 8.11లక్షల మొదటిసారి ఓటర్స్ ను నమోదు చేసాము ఆయన పేర్కొన్నారు. యువత-మహిళా ఓట్లను పెంచేందుకు ఎంతగానో కృషి చేశాం.. సక్సెస్ అయ్యామన్నారు. 3.45 లక్షల యంగ్ విమెన్ ఓట్లు నమోదు అయ్యాయి.. థర్డ్ జెండర్స్ తో సమావేశాలు పెట్టాము అని రాజీవ్ కుమార్ వెల్లడించారు.

Read Also: Jogi Ramesh vs Pawan Kalyan: 2024 తర్వాత పవన్‌తో రెండు సినిమాలు తీస్తానని ఏపీ మంత్రి ప్రకటన.. సినిమా పేర్లు ఇవే..!

35 వేల పీఎస్ లు, ప్రతీ పీఎస్ కు 897 మంది ఉన్నారు అని ఎన్నికల కమిషన్ పేర్కొన్నారు. మినిమమ్ వసతులు అన్ని కల్పిస్తున్నాం.. మొదటిసారి తెలంగాణలో వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేయడానికి ఫామ్ 12d ఏర్పాటు చేస్తున్నాం.. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం.. అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే cvigil యాప్ లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటాం.. ప్రతీ ఒక్కరూ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అని ఆయన తెలిపారు. suvidha పోర్టల్ ప్రతీ అభ్యర్థి డౌన్లోడ్ చేసుకోవాలి.. సమాచారం తెలుసుకోవచ్చు.. KYC అంటే KNOW YOUR CANDIDATE క్రిమినల్ బ్యాగ్రండ్ చెక్ చేసుకోవచ్చు అని రాజీవ్ కుమార్ చెప్పారు.

Read Also: Viral Video : వామ్మో బామ్మోయ్ ..ఈ వయస్సులో రిస్క్ అవసరమా.. స్కైడైవ్ చేస్తూ..

బర్దార్ లో 89 చెక్ పోస్ట్ లు, మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని రాజీవ్ కుమార్ అన్నారు. అక్రమంగా నగదు-మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి.. ఆన్లైన్ లో నగదు బదిలీల పై EC నిఘా ఉంటుంది.. ఎలిప్యాడ్స్, ఎయిర్ పోర్ట్స్ లో ప్రత్యేక నిఘా ఉంటుంది.. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ప్రతీ వారానికి ఒకసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించాం.. ఆరోపణలు(ఫిర్యాదు )వచ్చిన ప్రతీ నాయకులు సమాధానం చెప్పాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రకటనలు-సోషల్ మీడియాలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.. ఎన్నికలు పారదర్శనంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

Exit mobile version