NTV Telugu Site icon

Monditoka Jaganmohan Rao: ఎద్దుల బండిపై మొండితోక జగన్మోహన్రావు ఎన్నికల ప్రచారం..

Monditoka

Monditoka

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలంలోని ఉస్తేపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు ఉత్చాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి సరదగా గడుపుతు ముందుకు సాగారు. ఇక, ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోకకు ఉస్తేపల్లి గ్రామస్తులు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు ఎడ్లబండిపై ఎన్నికల ప్రచారం చేస్తూ.. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. మీరు నాకు ఓటు వేసి, నన్ను మరోసారి గెలిపించండి అని మొండితోక జగన్ మోహన్ రావు కోరారు. ఈ ప్రచారంలో భారీ సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Read Also: Warren Buffett: భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్నాను: వారెన్ బఫెట్

అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో చందర్లపాడు మండలంలోని తొర్లపాడు,తోటరావులపాడు,చింతలపాడు గ్రామాలు ఉప్పొంగాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావుకు పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు ఘన స్వాగతం పలుకుతున్నారు. వందలాది మంది తరలివచ్చి.. ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుపై పూల వర్షం కురిపించి ముందుకు నడిపిస్తున్నారు. చందర్లపాడు మండలంలోని ఉన్న గ్రామాలకు మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి.. మా పాలనలో మార్పు కనపడితే మాకు మద్దతు ఇవ్వండని నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు అభ్యర్థిస్తున్నారు.