ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంచికచర్ల మండలంలోని శేరి అమరవరం గ్రామంలో ప్రచారం నిర్వహించిన ఆయనకు మేమే నడిపిస్తాం.. మేమే గెలిపిస్తాం అంటూ స్థానిక ప్రజలు మద్దతు పలికారు. ఇక, మరోసారి మొండితోకకు తాము అండగా ఉంటామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన మహిళలు హామీ ఇచ్చారు.
Read Also: Nuclear War : అది ఊహించలేని విధ్వంసం.. 72 నిమిషాల్లో 300కోట్ల మంది మృత్యువాత
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా కంచికచర్ల మండలంలోని వేములపల్లి, శేరి అమరవరం గ్రామాల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావుకు గ్రామస్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి పథకాలు అందాలంటే జగనన్న గెలిపించండి అని కోరారు. పేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించాలంటే.. రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని నందిగామ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు అభ్యర్థించారు.
