Site icon NTV Telugu

Mohit Sharma: అన్ని ఫార్మేట్లకు గుడ్ బై చెప్పిన టీమిండియా ప్లేయర్..!

Mohith Sharma

Mohith Sharma

Mohit Sharma: వెటరన్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 37 ఏళ్ల మోహిత్‌ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ చేస్తూ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించారు. హర్యానా తరఫున ఆడటం నుంచి టీమిండియా జెర్సీ ధరించడం, ఆపై ఐపీఎల్‌లో ప్రదర్శనలు ఇవ్వడం వరకూ తన ప్రయాణం అద్భుతమైనదని.. అది తనకు ఒక వరంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. హర్యానా క్రికెట్‌ అసోసియేషన్‌కు, ఎల్లప్పుడూ తనను సరైన దారిలో నడిపించిన అనిరుధ్‌ సర్‌కు, బీసీసీఐ, కోచ్‌లు, సహచరులు, ఐపీఎల్‌ జట్లు, సపోర్ట్‌ సిబ్బంది, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తన మూడ్‌ స్వింగ్స్‌, కోపాన్ని ఓర్చుకుని ఎల్లప్పుడూ అండగా నిలిచిన తన భార్యకు కృతజ్ఞతలు చెప్పారు.

Localbody Elections: రక్త సంబంధీకుల మధ్య పోటీ..! సర్పంచ్‌ బరిలో అన్నాచెల్లెళ్లు.. అన్నాతమ్ముడు..

మోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 34 మ్యాచ్‌లు ఆడి, వన్డేల్లో 26 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు, టీ20ల్లో 8 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశారు. 2013లో భారత జట్టులో అరంగేట్రం చేసిన ఆయన, 2015 వన్డే ప్రపంచ కప్‌ జట్టులో సభ్యుడిగానూ ఉన్నారు. భారత్‌ తరఫున ఆయన చివరి మ్యాచ్‌ కూడా అదే ఏడాది ఆడారు. ఐపీఎల్‌లో దశాబ్దానికి పైగా కొనసాగిన మోహిత్‌.. మొత్తం 120 మ్యాచ్‌లు ఆడి 134 వికెట్లు సాధించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ముఖ్యంగా ధోని సారథ్యంలో ఓ నమ్మకమైన డెత్‌ బౌలర్‌గా గుర్తింపు పొందారు. 2023 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున రాణించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్స్ లో రెండో స్థానంలో నిలిచారు. ఐపీఎల్‌–2025 మినీ వేలానికి ముందు గుజరాత్‌ టైటాన్స్‌ విడిచిపెట్టడంతో.. కొత్త దశలోకి అడుగుపెడుతూ రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు తెలిపారు. ఆటకు దూరమైనా, భవిష్యత్తులో క్రికెట్‌కు ఇతర రూపాల్లో సేవలందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

South Africa vs India: టీమిండియా ఘోర ఓటమి.. రెండో వన్డేలో సత్తా చాటిన సఫారీలు

Exit mobile version