Malaikottai Vaaliban :అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న మోహన్ లాల్ మూవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన మలైకొట్టై వాలిబన్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా గ్రాండ్‍గా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 25న రిలీజ్ అయింది.ఈ మూవీని జానీ, మేరీ క్రియేటివ్ ఫిల్మ్స్, మ్యాక్స్ ల్యాబ్ సినిమాస్, సరేగామా మరియు ఆమెన్ మూవీ మొనాస్ట్రీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.లిజో జోస్ పిలిసెరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు మలైకొట్టై వాలిబన్ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.మలైకొట్టై వాలిబన్ సినిమా ఫిబ్రవరి 23వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానున్నట్లు తెలుస్తుంది.అంటే థియేటర్లలో రిలీజైన నెలలోపే ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై హాట్‍స్టార్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అతి త్వరలోనే హాట్ స్టార్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మలైకొట్టై వాలిబన్ సినిమా అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి వస్తోంది. మార్చి 1వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుందని ముందుగా సమాచారం బయటికి వచ్చింది. అయితే, థియేట్రికల్ రన్ ఇప్పటికే ముగిసిపోవటంతో ఫిబ్రవరి 23నే డిస్నీ+ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు ఈ మూవీ రెడీ అవుతోంది.మలైకొట్టై వాలిబన్ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలో ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్ కానుంది. అయితే, తెలుగు వెర్షన్ అందుబాటులోకి వస్తుందా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగులో కూడా థియేటర్లలో రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావించింది. అయితే, అది సాధ్యం కాలేదు. అందులోను ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావటంతో తెలుగు వెర్షన్ ను తీసుకురాలేదు. మరి ఓటీటీలో అయినా మలైకొట్టై వాలిబన్ తెలుగు డబ్బింగ్‍లో వస్తుందో లేదో చూడాలి
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!