NTV Telugu Site icon

Mohanlal: జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్న మోహన్ లాల్..

Mohan Lal

Mohan Lal

మోహన్ లాల్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తూ.. మలయాళం, తెలుగుతోపాటు వివిధ భాషల్లో సూపర్ క్రేజ్‌ సంపాదించుకున్నాడు మోహన్‌లాల్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఈ స్టార్ యాక్టర్‌ 63 ఏళ్ల వయస్సు వచ్చిన తగ్గేదేలే అంటున్నాడు.. ఈ వయస్సులో జిమ్‌లో రిస్కీ వర్కవుట్స్‌ చేస్తున్నాడు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషక్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..

ఎంత వయస్సు వచ్చిన స్టామినా అస్సలు తగ్గలేదు అని మరోసారి నిరూపించాడు.. వయస్సుతో సంబంధం లేకుండా స్టామినా ఉంటే చాలు అన్నట్టుగా యంగ్ యాక్టర్లు చేసే రిస్కీ కసరత్తులను ట్రైనర్‌ పర్యవేక్షణలో చేస్తూ వావ్ అనిపిస్తున్నాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లాది ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న మోహన్‌ లాల్‌ వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ టైటిల్‌ రోల్‌ లో నటిస్తోన్న జైలర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు మోహన్‌లాల్‌.. ఆ పాత్ర కోసం ఇంకా ప్రత్యేకంగా కనిపించాలని ఆయన వర్కౌట్స్ చేస్తున్నారు..

మోహన్‌ లాల్‌ తెలుగు, మలయాళ బైలింగ్యువల్‌ చిత్రంగా వస్తోన్న వృషభ లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ యంగ్ యాక్టర్‌ రోషన్‌ మేక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మోహన్‌ లాల్ మరోవైపు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న మలైకోటై వాలిబన్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాక్స్ ల్యాబ్స్‌-సెంచురీ ఫిలిమ్స్‌ బ్యానర్లపై జాన్‌-మేరీ క్రియేటివ్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్‌ లాల్ మరోవైపు Ram: Part 1 లో నటిస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉంది. దీంతోపాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.. తదుపరి సినిమాలో స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపించాలని జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తున్నారు.. అందుకు సంబందించిన వీడియోను ఒకసారి చూడండి..