Mohanlal: జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్న మోహన్ లాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహన్ లాల్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తూ.. మలయాళం, తెలుగుతోపాటు వివిధ భాషల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు మోహన్‌లాల్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఈ స్టార్ యాక్టర్ 63 ఏళ్ల వయస్సు వచ్చిన తగ్గేదేలే అంటున్నాడు.. ఈ వయస్సులో జిమ్‌లో రిస్కీ వర్కవుట్స్ చేస్తున్నాడు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషక్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..
ఎంత వయస్సు వచ్చిన స్టామినా అస్సలు తగ్గలేదు అని మరోసారి నిరూపించాడు.. వయస్సుతో సంబంధం లేకుండా స్టామినా ఉంటే చాలు అన్నట్టుగా యంగ్ యాక్టర్లు చేసే రిస్కీ కసరత్తులను ట్రైనర్ పర్యవేక్షణలో చేస్తూ వావ్ అనిపిస్తున్నాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లాది ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న మోహన్ లాల్ వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న జైలర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు మోహన్‌లాల్.. ఆ పాత్ర కోసం ఇంకా ప్రత్యేకంగా కనిపించాలని ఆయన వర్కౌట్స్ చేస్తున్నారు..
Also Read
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్‌లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
మోహన్ లాల్ తెలుగు, మలయాళ బైలింగ్యువల్ చిత్రంగా వస్తోన్న వృషభ లో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ యంగ్ యాక్టర్ రోషన్ మేక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మోహన్ లాల్ మరోవైపు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న మలైకోటై వాలిబన్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ లాల్ మరోవైపు Ram: Part 1 లో నటిస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతోపాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.. తదుపరి సినిమాలో స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపించాలని జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తున్నారు.. అందుకు సంబందించిన వీడియోను ఒకసారి చూడండి..
తాజావార్తలు
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!