Site icon NTV Telugu

Mohanlal-Shah Rukh Khan: నేను మీ డాన్స్‌లో సగమే చేశా.. మోహన్‌ లాల్‌పై షారుక్‌ఖాన్‌ ప్రశంసలు!

Mohanlal Zinda Banda Dance

Mohanlal Zinda Banda Dance

Shah Rukh Khan React on Mohanlal dance: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గ‌తేడాది న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో ‘జ‌వాన్’ ఒక‌టి. బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 1100 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమాకు త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. జ‌వాన్ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ అందించిన సంగీతం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాట‌లు ఎంత పెద్ద చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలిచాయి. తాజాగా జ‌వాన్ చిత్రంలోని ‘జిందా బందా’ సాంగ్‌కు మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ డ్యాన్స్ చేశారు. ఆ దృశ్యాలను ‘షారుక్‌ ఖాన్‌ యూనివర్స్‌ ఫ్యాన్ క్లబ్‌’ పేజ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

Also Read: Shivam Dube: ఏం ఆడుతున్నాడు.. శివమ్‌ దూబేకు టీ20 ప్రపంచకప్‌లో చోటు పక్కా!

మోహ‌న్ లాల్ డ్యాన్స్ వీడియో చూసిన షారుఖ్ ఖాన్ స్పందించారు. ‘ఈ పాటకు స్టెప్పులేసి నాకు ప్రత్యేకంగా నిలిపిన మోహన్‌ లాల్‌ సర్‌కు థ్యాంక్స్‌. మీరు చేసిన దాంట్లో నేను సగమే చేశాను అని అనుకుంటున్నా. లవ్‌ యూ సర్‌. మీతో కలిసి డిన్నర్‌ చేసేందుకు వేచి చూస్తున్నా’ అని షారుఖ్ ట్వీట్ చేశారు. ‘డియర్‌ షారుక్‌.. మీలాఎవరూ చేయలేరు. డ్యాన్స్‌లో మీది ప్రత్యేకమైన శైలి. మీ ప్రశంసలకు థ్యాంక్స్‌. కేవలం డిన్నరేనా.. మనమెందుకు కలిసి జిందా బందాకు డ్యాన్స్‌ చేయకూడదు’ అని షారుక్‌ ట్వీట్‌కు మోహన్‌ లాల్‌ రిప్లై ఇకాహారు. ‘ఓకే సర్‌.. డాన్స్ మీ ఇంట్లోనా? లేదా మా ఇంట్లో చేద్దామా’ అంటూ షారుక్‌ మరో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version