Site icon NTV Telugu

Mohan Bhagwat : శ్రీవాణి ట్రస్ట్‌పై ప్రశంసలు కురిపించిన ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్

Mohan Bhagwat

Mohan Bhagwat

తిరుమల శ్రీవాణి ట్రస్ట్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ ఆలయాల సమావేశం మరియు ఎగ్జిబిషన్ లో 30 దేశాల నుంచి వచ్చిన 1600 మంది ప్రతినిధులును ఉద్దేశించి ప్రసంగించిన మోహన్ భగవత్.. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సేకరించిన నిధులుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో టీటీడీ ఆలయాలు నిర్మించడంపై అభినందించారు. చిన్న, మధ్య స్థాయి ఆలయాలను గుర్తించి.. ఆ ఆలయ సంప్రదాయలను, ప్రాశస్త్యాని ప్రజలకు తెలియజెప్పే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఆలయాల ద్వారా హిందుమతం విలువలను తెలియజేయాలని ఆయన ఆన్నారు. అంతేకాకుండా.. మన సంస్కృతి సంప్రదాయలను ప్రజలుకు తెలియజేయాలని, ఆలయాలు ద్వారా విద్యా,వైద్య సేవలు ప్రజలకు అందించాలని ఆయన సూచించారు. పేదవారి వైద్యానికి ఆలయాల నుంచి సహకారం అందించాలని, భవిష్యత్త్ తరాలుకు మన సంప్రదాయాలు, సంసృతిని ఆలయాలా ద్వారా అందించాలని మోహన్ భగవత్ అన్నారు.

Also Read : Dowleswaram Barrage : ధవళేశ్వరం బ్యారేజీ వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి

అయితే.. స‌నాత‌న ధ‌ర్మప్రచారంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాలను నిర్మించేందుకు టీటీడీ ఈ ట్రస్టును ప్రారంభించింది. అయితే.. శ్రీ‌వాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళ‌మిచ్చే దాత‌ల‌కు ఒక బ్రేక్ ద‌ర్శన టికెట్ ప్రివిలేజ్‌గా అందజేయనున్నట్టు వివరించారు. అయితే, రూ.500 చెల్లించి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌లు ఒక రూపాయి నుంచి ఎంత‌మొత్త‌మైనా విరాళంగా అందజేయవచ్చని, రూ.10 వేలకు మించితే టీటీడీ క‌ల్పించే ప్రయోజ‌నాలు వ‌ర్తిస్తాయ‌ని పేర్కొన్నారు. రూ.10 వేల‌కు ఒక బ్రేక్ ద‌ర్శన టికెట్ చొప్పున 99 వేల వ‌ర‌కు 9 టికెట్లను దాత‌లు పొందే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఒక ల‌క్ష, ఆపైన విరాళాలు ఇచ్చే దాత‌ల‌కు టీటీడీ ఇదివ‌ర‌కే ప‌లు ట్రస్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న త‌ర‌హాలోనే ప్ర‌యోజ‌నాల‌ను వ‌ర్తింప‌జేస్తామ‌ని తెలిపారు.

Also Read : Virat Kohli Fan: కొడుకు ఆట కాకుండా.. విరాట్‌ కోహ్లీని చూడడానికే స్టేడియంకు వచ్చిన వెస్టిండీస్ ప్లేయర్ తల్లి!

Exit mobile version