Site icon NTV Telugu

Mohan Babu : కలెక్షన్ కింగ్.. 50 ఏళ్ల సినీ ప్రస్థానం – నేడు గ్రాండ్ సెలబ్రేషన్

Mohan Babu 50 Years

Mohan Babu 50 Years

తెలుగు సినిమాకు ఓ ప్రత్యేకమైన చెరగని ముద్ర వేసిన వారిలో బహుముఖ నట సమ్రాట్ మోహన్ బాబు ఒకరు. హీరోగా ఎంట్రీ ఇచ్చి, విలన్‌గా చెలరేగి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెరిసి, మళ్లీ హీరోగా తిరిగి ప్రేక్షకులను అలరించిన ఇలాంటి సినీ ప్రయాణం ప్రపంచ సినిమా చరిత్రలో కూడా చాలా అరుదు. నటుడిగా, నిర్మాతగా, విద్యా సేవలలోనూ అడుగడుగునా కొత్త మైలురాళ్లు నెలకొల్పిన మోహన్ బాబు ఈ సంవత్సరం తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.

Also Read : Keerthy Suresh : కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న కీర్తి సురేష్ ..

ఈ అరుదైన ఘట్టాన్ని పురస్కరించుకొని, నవంబర్‌ 22న అంటే నేడు ‘MB50 – A Pearl White Tribute’ పేరుతో ఒక గ్రాండ్ సెలబ్రేషన్‌ను ప్లాన్ చేశారు. ఈ భారీ వేడుకను ఆయన పెద్ద కుమారుడు విష్ణు మంచు స్వయంగా పర్యవేక్షిస్తుండటం విశేషం. మోహన్ బాబు చేసిన ప్రయాణం, తెరకు అందించిన నటన, ఇండస్ట్రీ కోసం చేసిన సేవలు – అన్నింటినీ ఒకే వేదికపై గుర్తు చేసుకునేలా ఈ ఈవెంట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇక మోహన్ బాబు సినీ కెరీర్‌ అంటే ఓ విశ్వవిద్యాలయం లాంటిది. 600కి పైగా చిత్రాల్లో నటించి, తనదైన డైలాగ్ డెలివరీ, క్రమశిక్షణ, తెరపై చూపించిన పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో తరతరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆయన చెప్పిన డైలాగ్‌లు, తెరమీద పోషించిన పాత్రలు – ఇవన్నీ ఈ రోజు వరకు కూడా ఫ్యాన్స్‌కు, కొత్త నటులకు స్పూర్తిగా నిలుస్తూనే ఉన్నాయి. అయితే MB50 అనేది కేవలం సినిమాల సెలబ్రేషన్ మాత్రమే కాదు. మోహన్ బాబు స్థాపించిన విద్యాసంస్థలు, దాతృత్వ కార్యక్రమాలు, సమాజానికి చేసిన సేవలు కూడా ఈ 50 ఏళ్ల ప్రయాణంలో అంతర్భాగమే. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఒంటరిగా అడుగు పెట్టి, తాను నమ్ముకున్న మార్గంలో క్రమశిక్షణతో ముందుకు సాగి, ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం నిజంగా గొప్ప విషయమే. నేడు జరగబోయే ‘MB50 – A Pearl White Tribute’ ఈవెంట్‌కు సంబంధించి వేదిక, అతిథులు, ప్రత్యేక కార్యక్రమాలు వంటి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా, నేటి వేడుక తెలుగు సినీప్రపంచానికి ఒక చారిత్రాత్మక క్షణం కానుందనడంలో సందేహం లేదు.

Exit mobile version