Mohammed Siraj Catch: గాల్లో వెనక్కి డైవ్ చేస్తూ.. నెక్ట్స్ లెవెల్ క్యాచ్ పట్టిన సిరాజ్!
- సిరాజ్ అబ్బురపరిచే ఫీల్డింగ్
- గాల్లో వెనక్కి డైవ్ చేస్తూ క్యాచ్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj Sensational Catch in Kanpur Test: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. హిట్‌మ్యాన్ సూపర్ క్యాచ్ అందుకున్న కాసేపటికే టీమిండియా పేసర్, మన హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసంతో మెరిశాడు. గాల్లో వెనక్కి డైవ్ చేస్తూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 57వ ఓవర్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేశాడు. అశ్విన్ వేసిన ఆరో బంతికి బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ క్రీజ్‌ను వదిలేసి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడాడు. అయితే సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. మిడాఫ్‌లో ఉన్న మహమ్మద్ సిరాజ్ బంతిని అందుకునేందుకు వెనక్కి పరిగెత్తాడు. గాల్లోనే వెనక్కి డైవ్ చేస్తూ.. ఎడమ చేతితో క్యాచ్‌ను అందుకున్నాడు. ఆపై కింద పడినా బంతిని వదల్లేదు. దాంతో షకిబ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. భారత ప్లేయర్స్ అందరూ సిరాజ్‌ను ఆడబినందించారు.
Also Read
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
Also Read: Rohit Sharma Catch: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో రోహిత్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో చూసి తీరాల్సిందే
మహమ్మద్ సిరాజ్ పట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. సిరాజ్ క్యాచ్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘క్యాచ్ ఆఫ్ ది ఇయర్’,’నెక్ట్స్ లెవెల్ క్యాచ్’, ‘సిరాజ్ భయ్యా.. ఏం పట్టావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి బంగ్లా 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మొమినల్ హక్ (102) సెంచరీ బాదాడు.
This is a next level catch from Siraj. 🔥 pic.twitter.com/JSxtEIFzRx
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2024
తాజావార్తలు
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!