NTV Telugu Site icon

Mohammed Siraj Catch: గాల్లో వెనక్కి డైవ్ చేస్తూ.. నెక్ట్స్ లెవెల్ క్యాచ్ పట్టిన సిరాజ్!

Mohammed Siraj Catch

Mohammed Siraj Catch

Mohammed Siraj Sensational Catch in Kanpur Test: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్టన్నింగ్ క్యాచ్‌ పట్టాడు. హిట్‌మ్యాన్‌ సూపర్ క్యాచ్ అందుకున్న కాసేపటికే టీమిండియా పేసర్, మన హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసంతో మెరిశాడు. గాల్లో వెనక్కి డైవ్ చేస్తూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 57వ ఓవర్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేశాడు. అశ్విన్ వేసిన ఆరో బంతికి బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్‌ షకిబ్ అల్ హసన్ క్రీజ్‌ను వదిలేసి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడాడు. అయితే సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. మిడాఫ్‌లో ఉన్న మహమ్మద్ సిరాజ్ బంతిని అందుకునేందుకు వెనక్కి పరిగెత్తాడు. గాల్లోనే వెనక్కి డైవ్ చేస్తూ.. ఎడమ చేతితో క్యాచ్‌ను అందుకున్నాడు. ఆపై కింద పడినా బంతిని వదల్లేదు. దాంతో షకిబ్‌ నిరాశగా పెవిలియన్ చేరాడు. భారత ప్లేయర్స్ అందరూ సిరాజ్‌ను ఆడబినందించారు.

Also Read: Rohit Sharma Catch: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో రోహిత్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో చూసి తీరాల్సిందే

మహమ్మద్ సిరాజ్ పట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది. సిరాజ్ క్యాచ్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘క్యాచ్ ఆఫ్ ది ఇయర్’,’నెక్ట్స్ లెవెల్ క్యాచ్’, ‘సిరాజ్ భయ్యా.. ఏం పట్టావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాలుగో రోజు లంచ్‌ బ్రేక్ సమయానికి బంగ్లా 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మొమినల్ హక్ (102) సెంచరీ బాదాడు.

Show comments