NTV Telugu Site icon

Mohammed Shami: ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకి షాక్.. గాయంతో దూరం కానున్న స్టార్ పేసర్!

Shami

Shami

Mohammed Shami: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన టీమిండియా 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. అయితే , టీమిండియా టెస్ట్ టీం, టి20 టీమిండియా జట్టు వేరురుగా ఉన్నాయి. ఇకపోతే ఈ నెలలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడవలసి ఉంది. అక్కడ సీనియర్ ఆటగాళ్లందరూ మళ్లీ టీంలోకి తిరిగి వస్తారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ పైనే అందరి దృష్టి ఉంటుంది. సిరీస్‌కి ఇంకా చాలా సమయం ఉంది. అయితే, టీమిండియాకు పెద్ద దెబ్బ తగిలింది. అయితే., మహ్మద్ షమీ పునరాగమనం చేసే అవకాశాలు ఇప్పుడు మసకబారినట్లు తెలిసింది. దీనికి కారణం అతను మళ్లీ గాయపడినట్లు సమాచారం.

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన నియమాలలో పెద్ద మార్పు.. అలా చేయకపోతే ఖాతా క్లోజ్!

2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనే మహ్మద్ షమీ గాయపడ్డాడు. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. ఇదివరకు NCAలో కోలుకుంటున్నడని.. భారతదేశం, ఆస్ట్రేలియా సిరీస్ అంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు ముందు అతను పూర్తిగా ఫిట్‌గా ఆడతాడని భావించారు. కాకపోతే తాజాగా మళ్లీ గాయపడిన విషయం వెలుగులోకి వచ్చింది. BCCI మెడికల్ టీం పర్యవేక్షణలో ఎన్‌సీఏలో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక షమీ కోలుకునేందుకు 6నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపింది. షమీ మోకాళ్లలో వాపు వచ్చిందని BCCI మెడికల్ టీం తెలిపింది.

2000rs Notes: ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు.. రూ.7117 కోట్ల విలువ..

న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉన్నప్పటికీ, భారత్ దృష్టి ఐదు టెస్టు మ్యాచ్‌లు జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌పైనే ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు వెళ్లే మార్గాన్ని ఈ సిరీస్ నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌ టీమిండియాకు అంత సులభం కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మహ్మద్ షమీ కోలుకునే పనిలో ఉన్నాడని, అతను చాలా వరకు కోలుకున్నాడని, అయితే ఇంతలో మరో ఎదురుదెబ్బ తగిలిందని మీడియా నివేదికల్లో పేర్కొంది.

Show comments