NTV Telugu Site icon

Mohammed Shami Double Century: టి20లో ‘డబుల్ సెంచరీ’ పూర్తి చేసిన మహ్మద్ షమీ.. ఎలాగంటే?

Mohammed Shami Double Century

Mohammed Shami Double Century

Mohammed Shami Double Century: ప్రస్తుతం దేశంలో దేశీయ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ టి20గా జరుగుతోంది. ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ బరోడా, బెంగాల్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో బరోడా జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇకపోతే, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం ఆడుతున్నాడు. తద్వారా అతను టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సంపాదించడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ బరోడా, బెంగాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అందరి చూపు షమీపైనే పడింది. బీసీసీఐ కూడా షమీ ఫిట్‌నెస్‌పై నిఘా పెట్టింది. అయితే, షమీ తన జట్టును మ్యాచ్‌లో గెలిపించలేకపోయినా అతను అద్భుతమైన ఫీట్ సాధించాడు.

Also Read: ICC Mens Player Of The Month: బుమ్రాను కాదని.. పాకిస్తాన్ ఆటగాడికి అవార్డు

బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడుతున్న మహ్మద్ షమీ 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. దింతో కాస్త ఎక్కువగానే పరుగులు ఇచ్చాడు. అయితే, ఈ సమయంలోనే అతను 2 వికెట్లు కూడా తీశాడు. ఈ రెండు వికెట్లతో షమీ టీ20 క్రికెట్‌లో 200 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌గా 200 వికెట్లు తీసిన 8వ భారతీయుడుగా షమీ రికార్డుకు ఎక్కాడు. షమీ కంటే ముందు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, ఉమేష్ యాదవ్ లు ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు.

Also Read: Bangladesh: చిన్మోయ్ కృష్ణదాస్‌కి మరోసారి బెయిల్ నిరాకరించిన బంగ్లా కోర్టు..

షమీ ఇప్పటివరకు 165 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో టీమ్ ఇండియా తరపున 23 మ్యాచ్‌లు ఆడాడు. తన టీ20 కెరీర్‌లో 3 సార్లు ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన ఘనతను కూడా సాధించాడు. ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దానితో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కానీ 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ జట్టు 18 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 41 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.