Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Mohammad Yousuf Slams Pakistan Cricket Politics After Loss To India T20 World Cup 2026

Mohammad Yousuf: “మీ రాజకీయాలే ముంచేశాయ్”.. జట్టు ఓటమిపై పాకిస్థాన్ లెజెండరీ యూసఫ్ ఫైర్..

Published Date :February 16, 2026 , 5:27 pm
By RAMAKRISHNA KENCHE
Mohammad Yousuf: “మీ రాజకీయాలే ముంచేశాయ్”.. జట్టు ఓటమిపై పాకిస్థాన్ లెజెండరీ యూసఫ్ ఫైర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mohammad Yousuf: నిన్న (ఆదివారం) శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఇరు దేశాలు ఎప్పటికీ మర్చిపోలేవు. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమి ఆ దేశస్థులను తీవ్రంగా కలిచివేసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రపంచానికి భారత్–పాకిస్థాన్‌ మధ్య ఉన్న అసలు తేడాను మరోసారి చూపించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపై ఆ దేశ లెజెండరీ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్ తీవ్రంగా విమర్శించాడు. సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.. “రాజకీయ ప్రభావం, వ్యక్తిగత అజెండాలు తొలగించకపోతే పాకిస్థాన్‌ మళ్లీ పుంజుకోదు. ఇది మన క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి కాలం” అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అర్హత లేని వ్యక్తులు పదవుల్లో ఉంటే జట్టు ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై పరోక్ష విమర్శలు చేశాడు.

READ MORE: Trisha vs Nayinar Nagendran: త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత నాగేంద్రన్

వాస్తవానికీ.. నఖ్శీ నిర్ణయాలు ఎప్పటినుంచో రాజకీయ రంగు పులుముకున్నవేనని విమర్శలు ఉన్నాయి. ఆసియా కప్ 2025 సమయంలో భారత్ అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ట్రోఫీని స్టేజ్ నుంచి తీసుకెళ్లడం పెద్ద వివాదంగా మారింది. ఇలాంటి దిక్కుమాలిన పని చేసిందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అతడిని సత్కరించడం మరింత చర్చకు దారి తీసింది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్‌తో మ్యాచ్ బహిష్కరించాలనే ఆలోచన వచ్చింది. ఇందుకు నఖ్వీ పాకిస్థాన్‌ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్‌తో సమావేశం ఏర్పాటు చేశాడు. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించాని ప్రధానిని ఒప్పించినట్లు తెలిసింది. తర్వాత ఐసీసీ అధికారులతో చర్చలు జరిగాక ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. ఈ సంఘటన క్రికెట్ కంటే రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనిపించిందని చాలామంది భావిస్తున్నారు. ఈ బహిష్కరణ డ్రామా జట్టుపై ప్రభావం చూపిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇలాంటి అంశాలు రావడం వల్లే కొలంబోలో భారత్ చేతిలో పాకిస్థాన్‌ అవమానకర ఓటమి చవిచూసిందని అభిప్రాయాలు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IND vs PAK 2026
  • India vs Pakistan Colombo match
  • Mohammad Yousuf
  • Mohsin Naqvi PCB
  • Pakistan cricket crisis

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

  • Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions