NTV Telugu Site icon

IPL 2024: హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపై మహ్మద్ నబీ అసంతృప్తి.. పోస్ట్ వైరల్..!

Nabi

Nabi

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్‌ పాండ్యాపై సొంత జట్టు ప్యాన్స్ కాదు.. సహచర ఆటగాళ్లు సైతం అసంతృప్తిగా ఉన్నారనే విషయం మరోసారి బహిర్గతమైంది. హార్థిక్ తీరును ఎప్పిటికప్పుడు సహచర ఆటగాళ్లు మాత్రం ఎండగడుతూనే ఉన్నారు. రోహిత్‌, బుమ్రా, సూర్యకుమార్‌ లాంటి సీనియర్లు గతంలో తమ అసంతృప్తిని వెల్లగక్కగా.. నిన్న పంజాబ్‌తో మ్యాచ్‌ పూర్తైన తర్వాత మరో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ (ఆఫ్ఘనిస్తాన్‌) తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌లో నబీ ఫ్యాన్ పోస్ట్ చేసిన దాన్ని అతడు తిరిగి పోస్ట్ గా యాడ్ చేశాడు. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. మీ కెప్టెన్‌ (ముంబై ) తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.. నేటి మ్యాచ్‌లో నబీ బౌలింగ్‌ చేయలేదు.. కీలక సమయంలో రెండు క్యాచ్‌లు, ఓ రనౌట్‌ చేసి ముంబై గెలుపులో నబీ కీలకపాత్ర పోషించాడని అతడి అభిమాని హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కాడు.

Read Also: Gehana Vasisth: అలాంటి సినిమాలు చెయ్యట్లే, పిలవకండి.. పోర్న్ రాకెట్ నటి సంచలనం!

ఇక, ఇదే పోస్ట్‌ను మహ్మద్ నబీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుని పరోక్షంగా తన అభిమానికి సపోర్ట్ ఇచ్చాడు. హార్దిక్‌ కెప్టెన్సీపై అసంతృప్తిని నేరుగా బయట పెట్టనప్పటికీ పరోక్షంగా తనలో భావాన్ని ఈ విధంగా వ్యక్త పరిచాడు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. ముంబై ఇండియన్స్‌లో చాలా మంది సీనియర్ల లాగే నబీ కూడా అసంతృప్తిగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు మహ్మద్ నబీకి మద్దతుగా నిలుస్తూ.. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ నిర్ణయాలను తప్పుబడుతున్నారు.