IND vs PAK: అభిషేక్ బ్యాటింగ్‌పై పాకిస్థాన్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు.. హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: క్రికెట్ యుద్ధానికి సమయం దగ్గర పడుతోంది. దాయాది జట్టును మట్టి కరిపించేందుకు టీమిండియా రెడీ అయ్యింది. ఆకలితో ఉన్న సింహంలా ఎదురు చూస్తోంది. అయితే.. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే మైదానంలో మాత్రమే కాదు.. మాటల యుద్ధం కూడా తప్పదు. ఈసారీ అదే జరిగింది. టీమిండియాలో అభిషేక్ ఎంట్రీపై ఎంత ఆసక్తి పెరిగిందో పెద్దగా చెప్పనవసరం లేదు. తాజాగా అభిషేక్‌పై పాక్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
READ MORE: Mamta Mohandas : 6 నెలలకే ముగిసిన పెళ్లి.. క్యాన్సర్ ఉన్నప్పుడే ఆ నటుడు నన్ను మోసం చేశాడు..
Also Read
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
- Hormuz: 3 నెలల తర్వాత సాఫీగా వాణిజ్య నౌకలు ప్రయాణం.. ఫొటోలు వైరల్
- Wife Kills Husband: ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమిర్ (Mohammad Amir) భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మను “స్లాగర్” అని పిలిచాడు. అభికి టెక్నిక్ లేదని విమర్శించాడు. స్లాగర్ అంటే టెక్నిక్ కంటే బలాన్ని నమ్మి వేగంగా పరుగులు సాధించడానికి ప్రయత్నించే బ్యాట్స్‌మన్ అని అర్థం. “అభిషేక్‌కు టెక్నిక్ లేదు.. సరైన ప్లాన్‌తో సులభంగా అవుట్ చేయొచ్చు” అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఈ అంశంపై తాజాగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) గట్టిగా స్పందించాడు. “కమ్ ఆన్.. మీ వ్యాఖ్యలకు నేను సపోర్ట్ చేస్తున్నాను.. మైదానం బయట నిలబడి మాటలు చెప్పడం చాలా ఈజీ. మీరు అభిషేక్‌ని స్లాగర్ అంటున్నారు కదా.. సరే, సిక్సర్లు కొట్టనివ్వండి.. అతను పూర్తి స్థాయి బ్యాటర్. అన్ని రకాల షాట్లు కొట్టగలడు” అంటూ హర్భజన్ కౌంటర్ ఇచ్చాడు. అభిషేక్ కేవలం బలంగా కొట్టే ఆటగాడు మాత్రమే కాదని భజ్జీ స్పష్టం చేశాడు.
READ MORE: Mamta Mohandas : 6 నెలలకే ముగిసిన పెళ్లి.. క్యాన్సర్ ఉన్నప్పుడే ఆ నటుడు నన్ను మోసం చేశాడు..
కవర్ మీదగా, పాయింట్ వైపు, లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, మిడ్‌వికెట్ ఇలా మైదానంలో ఎక్కడైనా షాట్ ఆడగల సామర్థ్యం ఉందని చెప్పాడు. బంతి ఎక్కడ పడుతుందో అర్థం చేసుకుని దానికి తగ్గట్టే ఆడతాడని ప్రశంసించాడు. మ్యాచ్‌కు ముందు ఈ మాటల యుద్ధం మరింత హీట్ పెంచింది. అభిషేక్ క్రీజ్‌లో నిలబడితే పాకిస్థాన్ బౌలర్లకు కష్టమేనని భజ్జీ హెచ్చరించాడు. “అతను సెట్ అయితే ఎవరో అందరికీ గుర్తు చేస్తాడు. గత నాలుగు ఐదు నెలలుగా మీ కలల్లోకి వస్తున్నాడు.రేపు పెద్ద ఇన్నింగ్స్ ఆడితే మరో ఆరు నెలలు మీకు నిద్ర ఉండదు” అంటూ అమీరుకు భజ్జీ కౌంటర్ ఇచ్చాడు.
తాజావార్తలు
-
TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
-
Hormuz: 3 నెలల తర్వాత సాఫీగా వాణిజ్య నౌకలు ప్రయాణం.. ఫొటోలు వైరల్
-
Wife Kills Husband: ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
-
EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
-
Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..