Mohamed Muizzu: రాష్ట్రపతి భవన్‌లో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు..

  • నాలుగు రోజుల భారత పర్యటన కోసం.
  • ఢిల్లీ చేరుకున్న మహ్మద్ ముయిజు.
  • రాష్ట్రపతి భవన్‌ లో స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోడీ & రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
Pm Modi

Pm Modi

Mohamed Muizzu: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు నాలుగు రోజుల భారత పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన సతీమణి సాజిదా మహమ్మద్ కూడా భారత్‌లో పర్యటించనున్నారు. అధ్యక్షుడు ముయిజ్జూ పాలంలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఆ తరువాత, ముయిజు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ అతనికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మహ్మద్ ముయిజు తమ దేశాల మంత్రులను ప్రతినిధులకు పరిచయం చేశారు.

Also Read: Mayank Yadav: నువ్వేం ప్రత్యేకంగా చెయ్యొద్దన్నాడు.. అసలు విషయం చెప్పిన మయాంక్‌ యాదవ్!

×
×
Ad

భారత మంత్రులకు పరిచయం చేసిన తర్వాత, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ మాల్దీవుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దీని తరువాత, అధ్యక్షుడు ముయిజు రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన సతీమణి సాజిదా మహమ్మద్ కూడా ఆయనతో ఉన్నారు. ఇకపోతే భారత్‌లో మహ్మద్ ముయిజుకు ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన. మహ్మద్ ముయిజు భారత పర్యటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలుపుతూ…, ఈ పర్యటన భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని అలాగే దేశాల మధ్య సహకారాన్ని పెంచుతుందని పేర్కొంది.

CPI Narayana: ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు