PM Modi: ఉత్తరాఖండ్ మృతుల కుటుంబాలకు మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. ఎంతంటే..!
- ఉత్తరాఖండ్ మృతుల కుటుంబాలకు మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటన
- మృతులకు 2 లక్షలు.. క్షతగాత్రులకు 50 వేలు
- 12 మంది మృతి... 14 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్‌లో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. టెంపో అదుపుతప్పి లోయలో పడి 12 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఇక ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని మోడీ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Chandrababu: నాకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు..
Also Read
శనివారం ఉదయం 11.30 గంటలకు 23 మంది ప్రయాణికులతో టెంపో రుద్రప్రయాగ్ వైపుగా వెళ్తోంది. హఠాత్తుగా వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. లోయ దాదాపు 150-200 మీటర్ల లోతులో ఉంది. ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనం లోయలోని అలనంద నదిలో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తంచేశారు.
#UPDATE | Death toll in Rudraprayag Tempo Traveller accident rises to 12.
14 people are injured in the incident: SDRF pic.twitter.com/VOq7wHRNCH
— ANI (@ANI) June 15, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు