NTV Telugu Site icon

PM Modi: ఉత్తరాఖండ్ మృతుల కుటుంబాలకు మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. ఎంతంటే..!

Midi

Midi

ఉత్తరాఖండ్‌లో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. టెంపో అదుపుతప్పి లోయలో పడి 12 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఇక ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని మోడీ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Chandrababu: నాకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు..

శనివారం ఉదయం 11.30 గంటలకు 23 మంది ప్రయాణికులతో టెంపో రుద్రప్రయాగ్‌ వైపుగా వెళ్తోంది. హఠాత్తుగా వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. లోయ దాదాపు 150-200 మీటర్ల లోతులో ఉంది. ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనం లోయలోని అలనంద నదిలో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి విచారం వ్యక్తంచేశారు.