PM Modi: భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 19 లేదా 20 తేదీల్లో రానున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించనున్నారు మోడీ. అనంతరం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఆయన పచ్చజెండా ఊపనున్నారు. వెంటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. రాష్ట్రానికి, దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంజూరులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చూపిన చొరవ ఫలించింది.
Read Also: Koppula Eshwar : మంత్రి కొప్పుల ఈశ్వర్ తో నాగాలాండ్ ఎన్సీపీ అధ్యక్షుడు లోథా భేటీ
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, విశాఖపట్నానికి వందే భారత్ రైళ్లు కావాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కొద్దివారాల క్రితం స్వయంగా కలిసి కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తున్న పలు రైళ్ల పొడిగింపునకు సంబంధించిన ప్రతిపాదనలను ఇవ్వడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులపైనా మాట్లాడారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేకు తొలి వందేభారత్ మంజూరయ్యింది. ప్రస్తుతం వందేభారత్‌లో సీట్లు మాత్రమే ఉన్నందువల్ల తొలుత విజయవాడ వరకు నడిపిస్తామని.. బెర్తులతో కూడిన వందేభారత్ రైళ్లు వచ్చాక విశాఖపట్నం వరకు పొడిగిస్తామని అశ్వినివైష్ణవ్ కిషన్‌రెడ్డికి తెలిపారు.