NTV Telugu Site icon

Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్ పరాజయంపై మోడీ ట్వీట్..పీటీ ఉషకి ప్రధాని ఫోన్

Modi Vinesh

Modi Vinesh

ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పరాజయాన్ని చవిచూసింది. సెమీ-ఫైనల్‌లో గెలిచిన తర్వాత ఆమె ఫైనల్ మ్యాచ్‌లోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ ఆమె బరువు నిర్దేశించిన నిబంధనల కంటే ఎక్కువగా ఉన్నందున ఆమె అనర్హత వేటుపడింది. ఒలింపిక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం వినేష్ ఫోగట్, భారత్ ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. ఇదిలా ఇండగా.. వినేష్ ఫోగట్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇలా రాశారు. ‘వినీష్ నువ్వు ఛాంపియన్లకే.. ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. ఇవాళ షాక్ తగిలింది. ఇది ఎంతటి బాధను కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన నుంచి నువ్వు బయటపడి బలంగా తిరిగి వస్తావని నేను ఆశిస్తున్నాను. మీమంతా నీకు అండగా ఉన్నాం” అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.

READ MORE: Virat Kohli Doop: బంగ్లాదేశ్ అల్లర్లు విరాట్ కోహ్లీ డూప్..

ఈ విషయమై భారత ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు పీటీ ఉషతో కూడా ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంపై ఉష నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. వినేష్ బహిష్కరణ తర్వాత భారతదేశానికి ఇప్పుడు ఏ ఎంపికలు ఉన్నాయని కూడా అడిగారు. వినేష్ ఫోగట్ కేసులో ఏమి చేయాలో చూడాలని పిటి ఉషను పీఎం మోడీ కోరినట్లు సమాచారం. ఈ సందర్భంలో.. చివరి ఎంపిక వరకు ప్రతి ప్రయత్నం చేయాలని తెలిపారు. ఇది మాత్రమే కాదు.. వినేష్ ఫోగట్‌కు సహాయం చేయడానికి ఒలింపిక్ కమిటీకి నిరసన తెలియజేయవలసి వస్తే.. చేయమని పీటీ ఉషతో మోడీ అన్నారు.

READ MORE:Lava Yuva Star Price: లావా నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ! ధర 7 వేలే

కాగా.. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కు భారీ షాక్‌ తగిలింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్‌కు చేరి.. పతకం ఖాయం చేసుకున్న స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండడంతో ఒలింపిక్‌ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వినేశ్‌ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. ఈ వేటుతో భారత్ సహా వినేశ్‌ స్వర్ణ పతకం ఆశలు గల్లంతయ్యాయి.