PM Modi: ఇటలీలో మోడీ బిజిబిజీ.. అగ్ర నేతలతో సమావేశం
- ఇటలీలో ప్రధాని మోడీ బిజిబిజీ
- అగ్ర నేతలతో సమావేశం
- పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధాని మోడీ.. శుక్రవారం బిజిబిజీగా గడిపారు. పలు దేశాల అధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇటలీ వేదికగా జరుగుతోన్న జీ7 దేశాల సదస్సులో భారత్ ఆహ్వానిత దేశంగా పాల్గొంది. ఈ సందర్భంగా జీ7 దేశాల అధినేతలతో మోడీ వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో కూడా సంభాషించారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Also Read
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తూనే.. రష్యా వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్‌కు పలుమార్లు దూరంగా ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుత సమావేశంలో పుతిన్ సేనలతో జరుగుతోన్న ఘర్షణకు సంబంధించి పలు అంశాలను మోడీకి జెలెన్ స్కీ వివరించినట్లు సమాచారం. ఇక ఈ జీ7 సదస్సులో ఈ యుద్ధం గురించే చర్చ జరిగింది. ఫ్రీజ్ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్‌కు 50 బిలియన్ల డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేసింది. దీనికి సభ్యదేశాలు తమ అంగీకారం తెలిపాయి. రక్షణ, అంతరిక్ష, విద్య, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మోడీ, మేక్రాన్ చర్చలు జరిపారు. దాంతోపాటు పలు కీలక విషయాలపై తమ మధ్య చర్చ జరిగినట్లు మోడీ వెల్లడించారు.

ఇదిలా ఉంటే G7 సమ్మిట్‌లో భాగంగా అవుట్‌రీచ్ సెషన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోస్ ఫ్రాన్సిస్-మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అంతేకాకుండా కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.



#WATCH | Prime Minister Narendra Modi meets Pope Francis at Outreach Session of G7 Summit in Italy. The Prime Minister also strikes up a conversation with British PM Rishi Sunak. pic.twitter.com/BNIpfK6lIN
— ANI (@ANI) June 14, 2024
తాజావార్తలు
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!