NTV Telugu Site icon

Anthony Albanese : మోడీ ఈజ్ ది బాస్ అంటూ ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రధాని

Aus Pm

Aus Pm

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం కానున్నారు. మోదీ మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఇది పాపువా న్యూ గినియా పర్యటన తర్వాత ఆయన పర్యటన చివరిది. ప్రధాని మోదీ తన పదవీ కాలంలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

Also Read : UPSC: సివిల్స్-2022 తుది ఫలితాలు విడుదల

సిడ్నీ చేరుకున్న ప్రధాని మోదీకి భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ భారీ ఎత్తున స్వాగతం పలికారు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రధాని మోడీ భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య బలమైన రక్షణ మరియు భద్రతా సహకారం కోసం తన కోరికను వ్యక్తం చేశారు.. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.. మోడీ రాకకు ముందు, ప్రధాని అల్బనీస్ ఆస్ట్రేలియాలో మోడీ అధికారిక పర్యటనకు ఆతిథ్యం ఇవ్వడం పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

Also Read : మైసూర్‌పాక్ నుంచి గులాబ్ జామూన్ దాకా.. ఈ స్వీట్లు ఎక్కడ నుంచి వచ్చాయో తెలుసా..?

ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశ పర్యటనలో ఆయనకు లభించిన సాదర స్వాగతంను ప్రస్తావిస్తూ.. సిడ్నీలోని ఖుడోస్ బ్యాంక్ ఎరీనాలో వేద మంత్రోచ్ఛారణలు మరియు ఇతర సాంప్రదాయ పద్ధతుల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ మాట్లాడిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ ప్రధాని మోడీయే బాస్ అంటూ ఆయన పేర్కోన్నారు.

Also Read : JioMart Layoff 2023: ఇక జియోమార్ట్ వంతు.. 1000మందిని తీసేసిన కంపెనీ

అయితే.. జపాన్‌లో జరిగిన జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 2023 మే 21 ఆదివారం రోజున పపువా న్యూ గినియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఘన స్వాగతం పలికారు. విమానం దిగి వస్తున్న మోడీ పాదాలకు మరాపే నమస్కరించారు. దీంతో మోడీ ఆయన్ను పైకి లేపి భూజాన్ని తట్టి కౌగిలించుకున్నారు.