Site icon NTV Telugu

PM Modi: రిషి సునక్‌తో మోడీ సంభాషణ.. దేనికోసమేంటే..!

Mdoe

Mdoe

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి రిషి సునక్‌తో టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తమ నిబద్ధతను చాటారు.

వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు ఇతరులతో సహా విభిన్న రంగాలలో రోడ్‌మ్యాప్ 2030 కింద సాధించిన పురోగతిపై ఇరువురు సంతృప్తి వ్యక్తం చేశారు.

రిషి సునక్‌ 2019 నుంచి 2020 వరకు ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా.. 2020 నుంచి 2022 వరకు ఆర్థిక మంత్రి పని చేశారు. రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ నుంచి 2015లో రిచ్‌మండ్ (యార్క్స్) పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. రిషి సునక్‌ 2022 అక్టోబర్ 24న భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ దేశ ప్రధానిగా నియమితులయ్యారు.

ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

Exit mobile version