Site icon NTV Telugu

Amit Shah On Terrorism: త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు.. ఆ ఉగ్రవాద సంస్థలను నిషేధించాం..

Sha

Sha

Jammu & Kashmir: యాసిన్ మాలిక్ ఉగ్రవాద సంస్థ జేకేఎల్‌ఎఫ్‌పై విధించిన నిషేధాన్ని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాల్లో జేకేఎల్‌ఎఫ్ (యాసిన్ మాలిక్ వర్గం) నిమగ్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యాసిన్ మాలిక్‌తో పాటు హోం మంత్రిత్వ శాఖ JKPL (ముక్తార్ అహ్మద్ వాజా), JKPL (బషీర్ అహ్మద్ తోట), JKPL (గులాం మహమ్మద్ ఖాన్), JKPL (అజీజ్ షేక్) వర్గాలను కూడా నిషేధించినట్లు కేంద్ర హోంమంత్ర్వశాఖ వెల్లడించింది. దేశ భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతకు ఎవరైనా సవాలు విసిరితే చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమిత్ షా అన్నారు. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గానూ మోడీ ప్రభుత్వం ‘జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫ్రీడమ్ లీగ్’ని నిషేధిత గ్రూపుగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.

Read Also: Uttarpradesh : తమ్ముడు, అతడి భార్య వేధింపులు భరించలేక ప్రైవేట్ పార్టు కోసుకున్న వ్యక్తి

ఇక, భారత ఎన్నికల సంఘం వచ్చే లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న తరుణంలో హోం మంత్రిత్వ శాఖ వేగంగా చర్యలు చేపట్టింది. ఈరోజు కొన్ని రాష్ట్రాల లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, మార్చి 12 వ తేదీన మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్‌ను చట్టవిరుద్ధమైన గ్రూపుగా పేర్కొంటూ నిషేధించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం నాడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ( X )లో ఒక పోస్ట్‌లో ఈ విషయాన్ని తెలిపారు. భారతదేశ ప్రజలు ఉగ్రవాద శక్తులను నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నారు అంటూ అమిత్ షా వెల్లడించారు.

Exit mobile version