Site icon NTV Telugu

Pm Modi: శివసేన(యూబీటీ)పై మోడీ ఫైర్.. ఏమన్నారంటే..?

Pm Narendra Modi

Pm Narendra Modi

మహారాష్ట్రలోని శివసేన(యూబీటీ)పై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నకిలీ శివసేన నాయకులు తనను మట్టి కరిపిస్తామంటూ కలలు కంటున్నారన్నారు. ఈ నకిలీ శివసేన నాయకులు తనను సజీవ సమాధి చేయాలని మాట్లాడుతున్నారన్నారు. రాజకీయంగా ఆ పార్టీ కుంచించుకుపోయిందని దుయ్యబట్టారు. దేశంలోని తల్లులు, సోదరీమణులు మోడీని రక్షిస్తారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో శుక్రవారం మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లో జరిగిన భారీ ర్యాలీలో మోడీ ప్రసంగించారు.

READ MORE: Sajjala Ramakrishna Reddy: ల్యాండ్‌ టైటిల్ యాక్ట్‌ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారు..

ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు శివసేన (యూబీటీ) నాయకులపై విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ రాజకుటుంబం లాంటి పెద్ద కుటుంబం నుంచి రాలేదన్నారు. పేదరికంలో పెరిగాను.. కష్టాలు పడ్డాను అని పేర్కొన్నారు. అదే సమయంలో ఎస్సీ-ఎస్టీ-ఓబీసీల రిజర్వేషన్లను కాపాడేందుకు మోడీ మహారక్షణ మహాయజ్ఞం చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు చాలా గిరిజన కుటుంబాలకు శాశ్వత ఇళ్లు లేవుని.. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు గడిచినా గ్రామాలకు కరెంటు రాలేదన్నారు. ప్రతి పేద, ప్రతి గిరిజనుడికి ఇల్లు, ప్రతి కుటుంబానికి నీటి సౌకర్యం, ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నందుర్‌బార్‌లో దాదాపు 1.25 లక్షల మంది పేదలకు శాశ్వత ఇళ్లు అందించామన్నారు. గత 10 ఏళ్లలో 4 కోట్ల పక్కా ఇళ్లు ఇచ్చామని.. మూడో టర్మ్‌లో మరో 3 కోట్ల ఇళ్లు ఇస్తామన్నారు.

Exit mobile version