PM Modi: సిగరెట్, పొగాకు, బీడీలపై కేంద్రం నిర్ణయించిన జీఎస్టీలను విమర్శిస్తూ.. కాంగ్రెస్ పెట్టిన పోస్టు వివాదానికి దారి తీసింది. బీడీ, బిహార్ ‘బి’తోనే మొదలవుతాయని పేర్కొనడంపై ఇప్పటికే బీజేపీ మండిపడింది. తాజాగా బీడీ-బీహార్ వివాదంపై కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)పై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం విమర్శలు గుప్పించారు. పూర్ణియా విమానాశ్రయంలో తాత్కాలిక టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థా;ఉనలు చేశారు. పూర్ణియాలో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఓవైపు.. బీహార్ పురోగతి సాధిస్తుంటే.. మరోవైపు రాష్ట్రాన్ని అవమానించడంలో ప్రతిపక్ష నాయకులు బిజీగా ఉన్నారని అన్నారు. బీహార్‌లో తయారైన రైలు ఇంజిన్‌లను ఆఫ్రికాకు ఎగుమతి చేస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. కానీ ఇది కాంగ్రెస్, ఆర్‌జేడీ నాయకులకు నచ్చడం లేదన్నారు. ఆర్‌జేడీతో భాగస్వామ్యంతో కాంగ్రెస్, సోషల్ మీడియాలో బీహార్‌ను ఎగతాళి చేయడంలో బిజీగా ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని బీడీతో పోల్చడంపై మండిపడ్డారు.
READ MORE: Unbelievable: భయం మా చెడ్డది సుమీ..! కుక్కల భయానికి ఇంటిపైకెక్కిన ఎద్దు.!
బిహార్ లో ప్రతిపక్షాలు చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నాయని.. కానీ, తమ ప్రభుత్వం వారిని తరిమేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల పాలనాపరమైన వైఫల్యాల కారణంగా రాష్ట్రం చాలా నష్టపోయిందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని వారు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఆ పార్టీల నేతలు కేవలం తమ కుటుంబాలను మాత్రమే పట్టించుకుంటారని.. తాను మాత్రం ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా విశ్వాస్’ను నమ్ముతాని మోడీ చెప్పారు. పేద ప్రజలను ఆదుకోవడమే తన ధ్యేయమన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు కోట్ల పక్కా గృహాల పంపిణీ చేపట్టామని, మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు వెల్లడించారు.
READ MORE: Supreme Court: రోగి మరణిస్తే.. డాక్టర్ బాధ్యత వహించడు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
