NTV Telugu Site icon

Modi 3.0 Swearing-In: మోడీ కేబినెట్‌లో మంత్రి పదవులు పొందే అవకాశం ఉన్న నేతలు జాబితా..

Pm Modi

Pm Modi

Modi 3.0 Swearing-In: మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 7.15 నిమిషాలకు ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు పలువురు ఎన్డీయే నేతలు ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ నివాసంలో కలిశారు. చిరాగ్ పాశ్వార్, పీయూష్ గోయల్, జై శంకర్, శివరాజ్ సింగ్ చౌహాన్, హెచ్‌డీ కుమారస్వామి మోడీని కలిసిన నేతల్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే, ఇరుగుపొరుగు దేశాలకు చెందిన దేశాధినేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో సహా పలువురు అంతర్జాతీయ దేశాధినేతలు హాజరుకానున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గేని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

Read Also: PM Modi Oath Ceremony LIVE Updates: నేడు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం.. లైవ్‌ అప్‌డేట్స్

ఇప్పటికే ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. జీ-20 సదస్సు మారిరిగానే మల్టీ లెవల్ భద్రతనను ఏర్పాటు చేశారు. డ్రోన్లు, స్నైపర్స్, పారామిలిటరీ సిబ్బంది, ఎన్ఎస్‌జీ కమాండోలు రాష్ట్రపతి భవన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఐదు కంపెనీల పారామిలిటరీ, ఢిల్లీ సాయుధ పోలీసుల జవాన్లలో సహా 2,500 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఢిల్లీలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గగనతల ఆంక్షలు విధించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులు సాయంత్రం 5 గంటల నుండి రావడం ప్రారంభిస్తారు మరియు 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరి చూపు మోడీ కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. మిత్రపక్షాలకు కూడా ఈ సారి మోడీ కేబినెట్‌లో సముచిత ప్రాధాన్యత కల్పించారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నవారి జాబితా ఇదే:

ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీతో ప్రమాణం చేయబోయే ఎంపీల తాత్కాలిక జాబితా ఇదే:

అమిత్ షా – బీజేపీ
రాజ్‌నాథ్ సింగ్ – బీజేపీ
నితిన్ గడ్కరీ – బీజేపీ
జ్యోతిరాదిత్య సింధియా – బీజేపీ
అర్జున్ రామ్ మేఘవాల్ – బీజేపీ
రక్షా ఖడ్సే – బీజేపీ
జితేంద్ర సింగ్ – బీజేపీ
కిరణ్ రిజుజు – బిజెపి
మన్సుఖ్ మాండవియా – బీజేపీ
అశ్విని వైష్ణవా – బీజేపీ
హర్దీప్ పూరి – బీజేపీ
జి కిషన్ రెడ్డి – బిజెపి
హర్దీప్ సింగ్ పూరి – బీజేపీ
శివరాజ్ సింగ్ చౌహాన్ – బీజేపీ
రావ్ ఇంద్రజిత్ సింగ్ – బీజేపీ
శంతను ఠాకూర్ – బీజేపీ
బండి సంజయ్ – బీజేపీ
బీఎల్ వర్మ – బీజేపీ
శోభా కరంద్లాజే – బీజేపీ
రవనీత్ సింగ్ బిట్టు – బీజేపీ
సర్బానంద సోనోవాల్ – బీజేపీ
మనోహర్ లాల్ ఖట్టర్ – బీజేపీ
హర్ష్ మల్హోత్రా – బీజేపీ
నిత్యానంద రాయ్ – బీజేపీ
అజయ్ తమ్తా – బీజేపీ
సావిత్రి ఠాకూర్ – బీజేపీ
ధర్మేంద్ర ప్రధాన్ – బీజేపీ
నిర్మలా సీతారామన్ – బీజేపీ
రామ్ మోహన్ నాయుడు కింజరపు – తెలుగుదేశం పార్టీ
చంద్రశేఖర్ పెమ్మసాని – తెలుగుదేశం పార్టీ
రాందాస్ అథవాలే – రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (A)
అనుప్రియా పటేల్ – అప్నా దళ్
జయంత్ చౌదరి – రాష్ట్రీయ లోక్ దళ్
జితన్ రామ్ మాంఝీ – హిందుస్తానీ అవామ్ మోర్చా
రామ్ నాథ్ ఠాకూర్ – జనతాదళ్ (యునైటెడ్)
చిరాగ్ పాశ్వాన్ – లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
హెచ్‌డి కుమారస్వామి – జనతాదళ్ (సెక్యులర్)
ప్రతాపరావు జాదవ్ – శివసేన