NTV Telugu Site icon

Lok sabha spekar: స్పీకర్‌ పదవిపై కన్నేసిన కింగ్ మేకర్లు.. మోడీ ప్లాన్ ఇదేనా?

Post

Post

ఆదివారం కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. మిత్రపక్షాల మద్దతుతో మోడీ.. సర్కార్‌ను నెలకొల్పారు. ఎవరికి దక్కాల్సిన పదవులను వారికి పంచేశారు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే.. అసలు సిసలైన మరో పోస్టు.. ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా మారింది. ఇప్పుడు దాని మీదే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కింగ్ మేకర్లు అయితే ఆ పోస్టుపై కన్నేశాయి. కానీ దాన్ని వదులుకునే పరిస్థితుల్లో పువ్వు పార్టీ ఉన్నట్లు కనిపించడం లేదు. అసలు ఆ పోస్టు ఏంటి?, దానికున్న అంత ప్రాముఖ్యత ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Damodara Rajanarsimha : డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లకు నియామక పత్రాలను అందజేసిన మంత్రి దామోదర రాజనర్సింహ

మోడీ సర్కార్‌లో జేడీయూ నితీష్ కుమార్.. తెలుగు దేశం చంద్రబాబు కింగ్ మేకర్లుగా ఉన్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీ మిత్ర పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అనుకూలమైన సమయం  అనుకున్నారో.. ఏమో తెలియదు గానీ.. జేడీయూ, టీడీపీ.. లోక్‌సభ స్పీకర్ పదవిపై కన్నేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టును జేడీయూ ప్రధానంగా కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగుదేశం కూడా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే స్పీకర్‌ పోస్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ఉద్దేశంలో పువ్వు పార్టీ కనిపించడం లేదు. స్పీకర్ పోస్టును తమ దగ్గరే ఉంచుకోవాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Kalki 2898AD: ట్రైలర్‌ వస్తోంది సరే.. వైజయంతీ వార్నింగ్ గుర్తుందా?

తొలుత ప్రొటెం స్పీ్కర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. అనంతరం లోక్‌సభ తొలి సమావేశంలో ప్రొటెం స్పీకర్ సారథ్యంలో ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. గత రెండు పర్యాయాలు స్పీకర్ పోస్టును బీజేపీనే సొంతం చేసుకుంది. సుమిత్రా మహాజన్, ఓం బిర్లా స్పీకర్‌లు‌గా ఉన్నారు. అయితే మూడోసారి మాత్రం సొంతంగా బీజేపీకి బలం లేకపోవడంతో మిత్ర పక్షాల సపోర్టుతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టును ఈసారి తమకే ఇవ్వాలని జేడీయూ, టీడీపీ పట్టుబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ స్పీకర్ పోస్టుకు ప్రస్తుతం భారీ డిమాండ్ పెరిగింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేడీయూ లేదా టీడీపీ కైవసం చేసుకుంటుందా? లేదంటే కాషాయ పార్టీనే సొంతం చేసుకుంటుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Etela Rajender : నా పాత్రను పార్టీ నిర్ణయిస్తుంది