NTV Telugu Site icon

IND vs BAN: భారత్ ముందు మోస్తరు లక్ష్యం.. 5 వికెట్లతో చెలరేగిన షమీ

Ind

Ind

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 49.4 ఓవర్లో 228 పరుగులు చేసింది. భారత్ ముందు 229 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. కాగా.. బంగ్లా జట్టుకు మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది. 30 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. భారత్ బౌలర్లు షమీ, అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్‌తో టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. బంగ్లాదేశ్ కష్టకాలంలో ఉన్న సమయంలో తోహిద్ హ్రిదోయ్, జాకీర్ అలీ జట్టును ఆదుకున్నారు. హ్రిదోయ్ (100), జాకీర్ అలీ (68) పరుగులు చేశారు. వీరిద్దరి మధ్య 150 పరుగుల భాగస్వామ్యం ఉంది. హ్రిదోయ్ 118 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో రాణించాడు. జాకీర్ అలీ 114 బంతుల్లో 4 ఫోర్లు కొట్టాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తంజీద్ హసన్ (25), రిషద్ హుస్సేన్ (18) పరుగులు చేశారు. నలుగురు బ్యాటర్లు ఏమీ పరుగులు చేయకుండానే డకౌట్ అయ్యారు.

Read Also: Raa Raja: మొహాలు చూపించకుండా సినిమా.. మార్చి 7న రిలీజ్

కాగా.. భారత్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొదటి 5 ఓవర్ల వరకూ ఐదు వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లు వేసిన మహమ్మద్ షమీ 5 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. అయితే టాప్ ఆర్డర్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించడంలో విజయవంతమై బౌలర్లు.. హ్రిదోయ్, జాకీర్ అలీ వికెట్లు పడగొట్టడానికి కష్టపడ్డారు. చివరకు జాకీర్ అలీ వికెట్ తీసినప్పటికీ.., హ్రిదోయ్ వికెట్ తీయడానికి చెమటోడ్చారు. చివరి ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలంటే 229 పరుగులు చేయాలి.

Read Also: Single Boy Story: “బాబు పెళ్లెప్పుడూ..” 30 ఏళ్లు దాటినా పెళ్లి అవ్వక మహేశ్ బాధలు వర్ణనాతీతం..