Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile SIM Card Rules 2026: మొబైల్ సిమ్ కార్డుల దుర్వినియోగం, నకిలీ పత్రాలతో కనెక్షన్ల జారీ వంటి మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. మన పేరు మీద తెలియకుండానే మొబైల్ కనెక్షన్ తీసుకుని ఉంటే.. దాని వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే మన పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం మంచిది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. సాధారణ వ్యక్తిగత మొబైల్ వినియోగదారుడు తన పేరుపై గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్లు కలిగి ఉండవచ్చు. జమ్మూకశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం వేరే పరిమితి ఉంది. తొమ్మిది కనెక్షన్లకు మించి ఉన్న సందర్భాల్లో నిబంధనల ప్రకారం అదనపు కనెక్షన్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మీ పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఇలా తెలుసుకోండి
కేంద్ర టెలికాం శాఖకు చెందిన సంచార్ సాథీ వేదికలోని TAFCOP సేవ ద్వారా మీ పేరుపై జారీ అయిన మొబైల్ కనెక్షన్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ సేవ వినియోగదారులు తమ పేరుపై ఉన్న మొబైల్ కనెక్షన్లను పరిశీలించడంతో పాటు, తమకు తెలియని లేదా అవసరం లేని నంబర్లను గుర్తించి వాటిపై చర్య కోరేందుకు ఉపయోగపడుతుంది. ముందుగా అధికారిక సంచార్ సాథీ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ‘Know Mobile Connections in Your Name’ లేదా TAFCOP సేవను ఎంచుకోవాలి. అనంతరం మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి OTP ద్వారా ధృవీకరించాలి. ధృవీకరణ పూర్తయిన తర్వాత మీ పేరు మీద ఉన్న మొబైల్ కనెక్షన్ల వివరాలను పరిశీలించవచ్చు.
Also Read
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
తెలియని నంబర్ కనిపిస్తే ఏం చేయాలి?
మీరు ఎప్పుడూ తీసుకోని లేదా ప్రస్తుతం ఉపయోగించని మొబైల్ నంబర్ మీ పేరుపై ఉన్నట్లు కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. TAFCOP ద్వారా అలాంటి కనెక్షన్‌ను రిపోర్ట్ చేసి, డిస్కనెక్షన్ కోసం అభ్యర్థించవచ్చు. మీకు అవసరం లేని కనెక్షన్‌ను కూడా ఇదే విధంగా తొలగించే ప్రక్రియను ప్రారంభించవచ్చు. నకిలీ పత్రాలతో సిమ్‌లు పొందడం, ఇతరుల పేర్లపై మొబైల్ కనెక్షన్లు తీసుకోవడం వంటి అక్రమాలను గుర్తించేందుకు టెలికాం శాఖ ప్రత్యేక వ్యవస్థలను ఉపయోగిస్తోంది. ఫేక్ డాక్యుమెంట్లతో తీసుకున్న అనుమానాస్పద మొబైల్ కనెక్షన్లను గుర్తించి డిస్కనెక్ట్ చేసినట్లు DoT తన నివేదికల్లో వెల్లడించింది.
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!