ప్రస్తుతం మనిషి జీవితంలో ‘స్మార్ట్‌ఫోన్’ ఓ బాగమైపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేవరకూ మొబైల్‌లోనే గడిపేస్తున్నారు. కాల్స్, షాపింగ్, విద్య, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్, బ్యాంకింగ్, ఆన్ లైన్‌చెల్లింపులు.. మొదలైన ఎన్నో పనులను ఫోన్ల ద్వారానే అవుతున్నాయి. దాంతో మనకు తెలియకుండానే స్మార్ట్‌ఫోన్‌ను బాగా వినియోగిస్తున్నాం. రోజులో ఎంతసేపు ఫోన్ ఉపయోగించామా? అని స్క్రీన్ టైమ్ చూశాక కొన్నిసార్లు కంగుతింటాం. స్క్రీన్ టైమ్‌కు చెక్ పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ టెక్ టిప్.
మీ మొబైల్‌లో చిన్న సెట్టింగ్ మార్పుతో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవచ్చు. ముందుగా మొబైల్ ‘Settings’లోకి వెళ్లి ‘Digital Wellbeing and Parental Controls’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ రోజులో ఏ అప్లికేషన్‌ను ఎంత సమయం వినియోగించారో కనిపిస్తుంది. కిందకు స్క్రోల్ చేయగానే ‘App Limits’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే.. మీ మొబైల్‌లోని యాప్‌లన్నీ కనిపిస్తాయి. మీరు ఏ అప్లికేషన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారో దాన్ని ఎంచుకొని.. స్క్రీన్ టైమ్‌ను సెట్ చేసుకోవాలి.
Also Read: IND vs BAN: రోహిత్ శర్మకు గంభీర్ సందేశం.. అసలు విషయం చెప్పిన మోర్కెల్!
ప్రతీ యాప్‌కు ప్రత్యేకంగా స్క్రీన్ టైమ్‌ను స్క్రీన్ టైమ్‌ను సెట్ చేసుకోవచ్చు. ఆ రోజు మీరు నిర్దేశించుకున్న టైమ్ లిమిట్ పూర్తయ్యాక.. ఆ యాప్ గ్రే కలర్‌లోకి మారిపోతుంది. మరుసటిరోజు మాత్రమే ఆ యాప్ యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ మీరు యాప్‌ను వినియోగించాలంటే.. సెట్టింగ్స్‌కు వెళ్లి స్క్రీన్ టైమ్‌ను మార్చుకోవాలి. ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.