NTV Telugu Site icon

Mobile Phones Banned: కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్ నిషేధం

Cell Phones

Cell Phones

సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం కోసం ఇటీవల ఒక యూట్యూబర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో తన లవ్ ప్రపోజ్ చేయడంతో ఆలయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. దీంతో టెంపుల్ లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ కఠిన చర్యలకు అమలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, గత కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంకు చెందిన ఫల్స్ నుంగే అనే ఒక యూట్యూబర్ తన ఫాలోవర్ల కోసం ఉత్రాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయంలో మోకరించి తన బాయ్ ఫ్రెండుకు లవ్ ప్రపోజ్ చేసింది.. ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అభిమానుల మెప్పు పొందడం కంటే వారి నుంచి దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

Read Also: Madhyapradesh: దారుణం..అప్పును ఇవ్వమన్నందుకు మామను ముక్కలుగా నరికిన అల్లుడు..

పవిత్రమైన ఆలయంలో పిచ్చి పనులేంటని నెటిజన్స్ కామెంట్లు చేశారు. ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని ఆమెపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలకే శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ ఓ మీటింగ్ ఏర్పాటు చేసి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుడదని కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు పేర్కొనింది.

Read Also: RPF Police Beats Child: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిపై పోలీసుల దాడి..

కేదార్‌నాథ్ ఆలయానికి వచ్చే యాత్రికులు మన సంప్రదాయ దుస్తులు ధరించాలని ఈ సందర్బంగా శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర తెలియజేశారు. గతంలో కొంతమంది ఇష్టానుసారంగా బట్టలు ధరించి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని చెబుతూ.. అది సరైన పద్దతి కాదు అని ఆయన అన్నారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆలయ కమిటీ అధ్యక్షుడు హెచ్చరించారు. బద్రీనాథ్ లో కూడా మొబైల్ ఫోన్లను నిషేధించే విషయమై ఆలోచిస్తున్నామని వెల్లడించారు.