HimachalPradesh : స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా దేశంలోని కొన్ని ప్రాంతాలకు కనీస సౌకర్యాలు లేవు. కానీ క్రమంగా మోడీ ప్రభుత్వం వారికి అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తోంది. అలాంటి గ్రామమే హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితికి చెందిన గ్యు. ఈ గ్రామం మొదటిసారిగా మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడింది. అనంతరం గ్యు గ్రామ వాసులతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ 13 నిమిషాలకు పైగా ప్రజలతో ఫోన్‌లో మాట్లాడారు. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక గ్రామస్థుడు ప్రధానమంత్రికి తన ప్రాంతం మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడుతుందని తాను నమ్మలేకపోతున్నానని తన ఆనందానికి అవధులు లేవని చెప్పాడు. గతంలో మొబైల్ ఫోన్లలో మాట్లాడాలంటే దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేదని గ్రామస్తులు తెలిపారు.
కమ్యూనికేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత
ప్రతి ఇంటికి కరెంటు అందించాలనే ప్రచారంలో విజయం సాధించిన తర్వాత, అన్ని ప్రాంతాలను కమ్యూనికేషన్ టెక్నాలజీతో అనుసంధానించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మోడీ అన్నారు. తాను పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికి 18 వేలకు పైగా గ్రామాల్లో విద్యుత్ కొరత ఉండేదన్నారు.
Read Also:Bengaluru: కూతురి హంతకుడిని చంపిన తల్లి.. బెంగళూర్‌లో డబుల్ మర్డర్ కలకలం..
సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి
గ్రామస్థులతో మాట్లాడుతున్న సందర్భంగా ప్రధానమంత్రి వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ (VVP) కింద సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు సరిహద్దు ప్రాంతాలను వదిలేశాయన్నారు.
ప్రజలకు ప్రయోజనం
తన మూడో టర్మ్‌లో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తానని ప్రధాని చెప్పారు. దీంతో మారుమూల ప్రాంతాల్లో నివసించే పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం కూడా ఎంతో మేలు చేస్తుందన్నారు.
Read Also:Rohit Sharma: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!