NTV Telugu Site icon

Mobile Internet: ఫోన్‌లో ఇంటర్నెట్‌ స్లోగా వస్తోందా.. అయితే ఇలా చేయండి..

Internet

Internet

ఆధునిక సాంకేతిక యుగంలో ఇంటర్నెట్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మనం నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం నిత్య జీవితంలో ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఎన్నో పనులు చేస్తుంటాం. అద్దె చెల్లించడం, డబ్బు లావాదేవీలు చేయడం, షాపింగ్ చేయడం, సినిమాలు చూడటం లాంటి అనేక పనులు ఇంటర్నెట్ లేకుండా సాధ్యం కాదు. కానీ కొన్నిసార్లు ఇంటర్నెట్ స్పీడ్ అకస్మాత్తుగా పడిపోతుంది. దీని వల్ల బ్రౌజింగ్ డౌన్‌లోడ్ సరిగా పనిచేయదు. చాలా వరకు పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మనం చాలా ఆందోళన చెందుతాం. అయితే, ఈ చిట్కాలతో మీరు మీ ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు.

Also Read: Crime Case: ఇదెక్కడి మాస్ మావా.. సినిమా రేంజిలో పోలీసుల స్కెచ్.. ముఠా గుట్టు రట్టు..

అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ‘ఫైట్ మోడ్’ ఎంపిక ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేయడానికి, “సెట్టింగులు” లోకి వెళ్లి., “ఫైట్ మోడ్” ఆఫ్ చేయండి. మీరు దీన్ని ఆ తర్వాత ఆన్ చేసిన తర్వాత, మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ పూర్తి వేగంతో రన్ అవుతుంది. మీ ఫోన్‌లో ఇంటర్నెట్ వేగాన్ని మెరుగుపరచడానికి మరొక సులభమైన మార్గం మొబైల్ డేటా ఎంపికను నిలిపివేయడం. మీరు మీ మొబైల్ డేటాను పూర్తి వేగంతో వాడడానికి కొంత సమయం పాటు మీ ఫోన్ డేటాను ఆఫ్ చేసి, కొంత సమయం తర్వాత దాన్ని పునఃప్రారంభించవచ్చు. సాధారణంగా, ఇంటర్నెట్ వేగం నెట్‌వర్క్ రకంపై ఆధారపడి ఉంటుంది.

Also Read: DC vs MI: సొంత గడ్డలో వీరవిహారం చేసిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ 258..

4G నెట్‌వర్క్ ఉన్నప్పుడు, ఇంటర్నెట్ వేగంగా పని చేస్తుంది. కొన్ని నెట్‌వర్క్‌లు సరిగ్గా పని చేయకపోవచ్చు. దీన్ని సరి చేయడానికి, ముందుగా మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి 4G మొబైల్ నెట్‌వర్క్‌ సరిగా ఉందోలేదో చెక్ చేయండి. తర్వాత నెట్‌వర్క్ సెట్టింగ్‌లకు వెళ్లి, యాక్సెస్ పాయింట్ పేర్లపై క్లిక్ చేసి, APN ని డిఫాల్ట్ సెట్టింగ్‌ లకు రీసెట్ చేయండి. చాలా సందర్భాలలో, మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా పని చేయకపోతే, మీ ఫోన్ లేటెస్ట్ అప్‌డేట్‌ తో తాజాగా లేనందున కూడా కావచ్చు. కాబట్టి మీ ఫోన్‌ లో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఉందో లేదో చెక్ చేసుకోండి.