NTV Telugu Site icon

Kishan Reddy: గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్

Kishan Reddy

Kishan Reddy

MMTS from Hyderabad to Yadadri: వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ముందుగా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. అనంతరం కిషన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ జాతీయ రహదారులకు కృషి చేశామన్నారు. కేంద్రం ఇటీవల రాష్ట్రానికి రైల్వే తయారీ యూనిట్‌ను కేటాయించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంటీఎస్ కూడా కేటాయించామని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జాతీయ రహదారులు బాగుపడ్డాయన్నారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోడీ ప్రధాని కాకముందు తెలంగాణకు 2,500 కి.మీ ఉంటే ఇప్పుడు 5 వేల కి.మీలకు చేరుకుందన్నారు. 150 ఎకరాల్లో రైలు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు 7 వ్యాగన్ల ఉత్పత్తి సామర్థ్యానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ. 500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

Read also: CM Jagan : మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు

తెలంగాణలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా సుమారు కోటి మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా. యాదాద్రి దేవాలయం హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉంది. యాదాద్రికి నగరం నుంచి రోజుకు 10 వేల మంది భక్తులు వస్తున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అయితే భక్తులు అక్కడికి వెళ్లేందుకు రవాణా పరంగా ఇబ్బందులు పడుతున్నారు. టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో నగరం నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు నడిపితే బాగుంటుందని భక్తులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ ఘట్‌కేసర్‌ వరకు ఉంది. సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు 21 కిలోమీటర్ల మార్గంలో ఎంఎంటీఎస్‌ రెండో దశ రైల్వే లైన్‌ అందుబాటులోకి వచ్చింది. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రికి మరో 32 కి.మీ. రెండో దశ రహదారిని పొడిగిస్తే యాదాద్రి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఈ రైలు మార్గానికి రూ.330 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. కేంద్రం తన వాటాగా రూ.110 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం రెండు షేర్ల కింద రూ.220 కోట్లు భరించేందుకు అంగీకరించింది.

Show comments